Nagababu Beats Auto Ramprasad: ఈటీవీ ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాగబాబు , రోజా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించేవారు. ఈ షో కి సగం కల తీసుకొచ్చింది వాళ్ళే. ముఖ్యంగా నాగబాబు నవ్వుకి అప్పట్లో ఉండే క్రేజ్ వేరు. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత నాగబాబు ఈ షో నుండి తప్పుకోవడం, ఆ తర్వాత కొన్నాళ్ళకు రోజా కూడా మంత్రి అవ్వడం తో ఈ షో నుండి వైదొలగడం వంటివి జబర్దస్త్ రేంజ్ ని బాగా తగ్గించాయి. నాగబాబు వెళ్లిపోవడం తో చాలా మంది టాప్ కమెడియన్స్ ఆయనతో పాటు వెళ్లిపోయారు. సుడిగాలి సుధీర్, హైప్ ఆది వంటి వారు ఉండడం వల్ల , షో కి టీఆర్ఫీ రేటింగ్స్ తగ్గిపోలేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు వెళ్లిపోయారో , షో రేటింగ్స్ బాగా పడిపోయాయి.
మళ్లీ ఈ షో కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మల్లె మాల ఎంటర్టైన్మెంట్స్ టీం చాలా కష్టపడుతోంది. అందులో భాగంగానే నాగబాబు ని మళ్లీ తీసుకొచ్చారు. ఆయన నవ్వులను మిస్ అయ్యే అభిమానులు , ఇప్పుడు నాగబాబు కోసం ఒక సెక్షన్ ఆడియన్స్ ఈ షో ని మళ్లీ చూడడం మొదలు పెట్టారు. అయితే రీసెంట్ గానే ఈ షో స్పెషల్ ప్రమోషన్ కోసం , నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా నాగబాబు తో ఒక రీల్ ని చేయించారు జబర్దస్త్ మేకర్స్. ఈ రీల్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. ముందుగా జబర్దస్త్ కమెడియన్స్ ఒక్కొక్కరిగా నాగబాబు వద్దకు వస్తూ , ఇదే మా స్క్రిప్ట్ , ఒకసారి చదివి ఎలా ఉందో చెప్పండి అంటారు. నాగబాబు వాళ్లకు తన మార్కు పంచులు ఇస్తుంటాడు . ఇక చివర్లో ఆటో రాంప్రసాద్ నాగబాబు వద్దకు వస్తాడు.
ఇదే నా స్క్రిప్ట్ , మీరు ఎక్కడ నవ్వాలో కూడా ఈ స్క్రిప్ట్ లో రాసి ఉంది చూడండి అంటాడు రామ్ ప్రసాద్. అప్పుడు నాగబాబు ‘వెరీ గుడ్.. ఆ మార్కుల బోర్డు అందుకో’ అని అంటాడు. దానిని తీసుకొని నాగబాబు చేతికి ఇవ్వగానే , రామ్ ప్రసాద్ ని ఒంగోబెట్టి చితకబాదుతాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తన్నాము చూడండి. గతం లో నాగబాబు సునామి సుధాకర్ అనే కమెడియన్ ని ఇలాగే కుమ్ముతాడు. ఇప్పుడు ఆటో రామ్ ప్రసాద్ ని కుమ్మడం చూసినప్పుడు కూడా ఆ సంఘటనే అందరికీ గుర్తుకొచ్చింది. మీకు కూడా అలాగే అనిపించిందో లేదో ఈ వీడియో ని చూసి కామెంట్ చేయండి.