Homeఎంటర్టైన్మెంట్Venkatesh Pawan Kalyan Combo Missed: పవన్ కళ్యాణ్ దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్.. బ్లాక్...

Venkatesh Pawan Kalyan Combo Missed: పవన్ కళ్యాణ్ దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్.. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మిస్ అయిందిగా..

Venkatesh Pawan Kalyan Combo Missed: మన టాలీవుడ్ లో ఇప్పుడు ‘జెన్ జీ’ ఆడియన్స్ కోరికకు తగ్గట్టుగా క్రేజీ కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి కాంబినేషన్స్ ని గతం లో కూడా ప్లాన్ చేశారు , కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి కాంబినేషన్స్ ని ఎక్కువ శాతం మిస్ అయిన హీరోల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పేరు నే ప్రధానంగా చెప్పొచ్చు. టాలీవుడ్ లో స్టార్స్ గా చలామణి అయిన ప్రతీ […]

Venkatesh Pawan Kalyan Combo Missed: మన టాలీవుడ్ లో ఇప్పుడు ‘జెన్ జీ’ ఆడియన్స్ కోరికకు తగ్గట్టుగా క్రేజీ కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి కాంబినేషన్స్ ని గతం లో కూడా ప్లాన్ చేశారు , కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి కాంబినేషన్స్ ని ఎక్కువ శాతం మిస్ అయిన హీరోల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పేరు నే ప్రధానంగా చెప్పొచ్చు. టాలీవుడ్ లో స్టార్స్ గా చలామణి అయిన ప్రతీ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో గతం లో ఒక మంచి సినిమా తియ్యాలి అనుకున్నోళ్ళే. కానీ ఆయన ఎందుకో చేయలేకపోయాడు. అయితే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం వేరేలా ఉండేది. సినిమా లోని ప్రతీ క్రాఫ్ట్ లో తన మార్కు ని కనిపించేలా చూసుకునేవాడు. అలా కేవలం 7 సినిమాల అనుభవం తోనే ‘జానీ’ చిత్రం తో డైరెక్టర్ గా మారిపోయాడు.

ఈ సినిమా ఆరోజుల్లో బాహుబలి రేంజ్ క్రేజ్ తో విడుదలైంది . కానీ అప్పటి ఆడియన్స్ కి ఈ సినిమా అర్థం కాకపోవడం తో డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా ‘ఖుషి’ తర్వాత విడుదలైన సంగతి తెలిసిందే. ఖుషి తర్వాత చాలా కాలం వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే ఆలోచనలో లేడు. కాస్త గ్యాప్ తీసుకొని , ఒక మంచి కథ రాసుకున్నాడు. తన స్వీయ దర్శకత్వం లో ఈ కథ తో విక్టరీ వెంకటేష్ ని హీరో గా పెట్టి సినిమా తీయాలని అనుకున్నాడు. వెంకటేష్ కి పవన్ కళ్యాణ్ అత్యంత ఆప్త మిత్రుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి కి వెంకటేష్ తో కేవలం స్నేహం మాత్రమే ఉంది , కానీ పవన్ కళ్యాణ్ తో వెంకటేష్ కి రిలేషన్ స్నేహం కంటే గొప్పది. అన్నదమ్ములు లాగానే కలిసి మెలిసి ఉండేవారు.

ఆ రిలేషన్ తోనే పవన్ అడగగానే వెంకటేష్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. కానీ ఎందుకో ఎక్కడో స్టోరీ లో చిన్న తేడా కొడుతోంది లోపు ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే ఇదే లవ్ స్టోరీ కి మార్షల్ ఆర్ట్స్ నేపధ్యాన్ని జోడించి ‘జానీ’ గా మలిచాడు పవన్ కళ్యాణ్. అలా మొదలైన జానీ ప్రస్థానం విడుదలకు ముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల యువతని ఒక మేనియా లో మునిగి తేలేలా చేసింది. కానీ చివరికి ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. అప్పటి వరకు కెరీర్ లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని పవన్ కళ్యాణ్ కి మొట్టమొదటి ఫ్లాప్ పడడంతో అభిమానులు ఆరోజుల్లో జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమా తర్వాత విడుదలైన నాలుగు సినిమాలు యావరేజ్ గా ఆడాయి, ఆ తర్వాత జల్సా లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper