Homeఎంటర్టైన్మెంట్Prabhas Darling Re Release Collections: రీ రిలీజ్ ట్రెండ్ లో ఆ అరుదైన ఘనత...

Prabhas Darling Re Release Collections: రీ రిలీజ్ ట్రెండ్ లో ఆ అరుదైన ఘనత పవన్ కళ్యాణ్ , ప్రభాస్ కి మాత్రమే దక్కింది..

Prabhas Darling Re Release Collections: సాధారణంగా రీ రిలీజ్ సినిమాలను వీకెండ్ కి విడుదల చేస్తుంటారు , లేదంటే ఏదైనా స్పెషల్ డే సందర్భంగా చేస్తుంటారు , కానీ వర్కింగ్ డే లో విడుదల చేసి, భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టడం అంటే చాలా కష్టమైన విషయం. అనేక మంది హీరోల రీ రిలీజ్ సినిమాలు ఇలాగే వర్కింగ్ డే విడుదలై చేతులు కాల్చుకున్నాయి. కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ప్రభాస్(rebel Star […]

Prabhas Darling Re Release Collections: సాధారణంగా రీ రిలీజ్ సినిమాలను వీకెండ్ కి విడుదల చేస్తుంటారు , లేదంటే ఏదైనా స్పెషల్ డే సందర్భంగా చేస్తుంటారు , కానీ వర్కింగ్ డే లో విడుదల చేసి, భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టడం అంటే చాలా కష్టమైన విషయం. అనేక మంది హీరోల రీ రిలీజ్ సినిమాలు ఇలాగే వర్కింగ్ డే విడుదలై చేతులు కాల్చుకున్నాయి. కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ప్రభాస్(rebel Star Prabhas) సినిమాలు మాత్రమే వర్కింగ్ డే లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. దీనిని బట్టీ వీళ్ళిద్దరికే జెన్ జీ కుర్రాళ్లలో ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న ప్రభాస్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘డార్లింగ్’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. దీనికి సెన్సేషనల్ ఓపెనింగ్ దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 5 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యలేదు, అదే విధంగా వేరే ఏదైనా స్పెషల్ అకేషన్ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినప్పటికీ ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రభాస్ అభిమానులు ఒక సినిమాని బలంగా థియేటర్ లో చూడాలని అనుకుంటే , ఇలా ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ సంగతి పక్కన పెడితే , రెండేళ్ల క్రితం విడువులైన పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ కి అయితే ఏకంగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మొదటి రోజున వచ్చాయి. ఈ రికార్డు ని ఇప్పటి వరకు ముట్టుకున్నోళ్ళు లేదు. ఎన్నో చిత్రాలు భారీ హైప్ తో విడుదలయ్యాయి , కానీ ఒక్క సినిమా కూడా గబ్బర్ సింగ్ దరిదాపుల్లోకి రాలేదు.

పైగా ఈ సినిమా విడుదలైంది సోమవారం రోజున. అంటే వర్కింగ్ డే , ఈ చిత్రానికి ఎదురుగా అప్పుడే కొత్తగా విడుదలైన నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ చిత్రం ఉంది. ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం తో , ఆ చిత్రానికి సంబంధించిన బయ్యర్స్ గబ్బర్ సింగ్ కి టాప్ థియేటర్స్ ని ఇవ్వడానికి నిరాకరించారు. అయినప్పటికీ , మామూలు రిలీజ్ తోనే ఈ చిత్రానికి ఈ రేంజ్ సెన్సేషనల్ రికార్డు నమోదు అయ్యింది. ఈ రికార్డుని కొట్టాలంటే మళ్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్లనే అవ్వుద్దని, ఇక ఎవరి వల్ల కాదని , సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు ఉంది. ఆరోజున పోకిరి చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కనీసం ఇదైనా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ రికార్డు ని కొడుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper