ప్రతి బాల్ సిక్స్ కొట్టాలని తపించే అబ్బాయి.. ప్రతి బాల్ ను నోబాల్ ఇచ్చే అంపైర్ లాంటి అమ్మాయి.. ఈ భిన్న దృవాలు కలవడం అసాధ్యం.. కానీ వారి మధ్యప్రేమ ఎలా పుట్టింది? ఎలా సాగిందన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన మూవీ ‘వరుడు కావలెను’. నాగశౌర్య(Naga Showrya) హీరోగా.. రీతూ వర్మ(Ritu Varma) హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. తాజాగా టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఆసక్తి రేపేలా టీజర్ ను డిజైన్ చేశారు.
అస్సలు ఎంత మంది అబ్బాయిలు లైన్ వేసినా కూడా పడని టెంప్ట్ కానీ గట్టి అమ్మాయి రీతూ వర్మ కోసం ప్రయత్నిస్తుంటాడు మన హీరో నాగశౌర్య. పనిరాక్షసి అయిన వధువుకు ఎలాంటి వరుడు దొరికాడనే ఆసక్తికర పాయింట్ తో ‘వరుడు కావలెను’ అనే సినిమాను రూపొందించారు.
టీజర్ లో విజువల్స్ చాలా రిచ్ గా కూల్ గా ఉన్నాయి. మాటలు నవ్వులు పూయిస్తున్నాయి. ఓ కూల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా టీజర్ చూస్తే కనిపిస్తోంది. నాగశౌర్య-రీతూవర్మ మధ్య ప్రేమ ఎలా పండింది? ఈ భిన్న ధృవాలు ఎలా కలిశారన్నది ఆసక్తి రేపుతోంది.
చివర్లో కమెడియన్ వెన్నెల కిషోర్ కామెడీ పంచులు, ఫ్యామిలీ డ్రామాలు చూస్తే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫోక్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రంయూనిట్ తెలిపింది.