spot_img
Homeఎంటర్టైన్మెంట్బ్రేకప్స్, డైవోర్స్ మధ్య 'నాగచైతన్య' ?

బ్రేకప్స్, డైవోర్స్ మధ్య ‘నాగచైతన్య’ ?

Naga Chaitanya
కూల్ హీరో ‘నాగచైతన్య’ ఓ తమిళ్ రీమేక్ లో నటించబోతున్నాడా ? ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో ‘ఓ మై కడవులే’ అనే సినిమా విడుదలై.. మంచి ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను కూడా సాధించి.. మొత్తానికి అక్కడ మంచి సినిమాగా నిలిచిపోయింది. ఇక అప్పటినుండి పక్క భాషా నిర్మాతలు కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెగ పోటీ పడుతూ వచ్చారు. అయితే, అలాంటి పోటీలను గెలవడంలో ఆరితేరిపోయిన పీవీపీ, మొత్తానికి ఆ పోటీని గెలిచారనుకోండి. దాంతో ‘ఓ మై కడవులే’ సినిమా తెలుగులోకి రీమేక్ కాబోతుంది. మరి హీరోను ఎవర్ని తీసుకోవాలి అని మొదలైన ప్రశ్న, తాజాగా చైతు ఈ సినిమా చూసి ఓకే చెప్పడంతో సమాప్తమైంది.

Also Read:  ‘కేజీయఫ్‌2’లో నేను పవర్ ఫుల్‌ – రవీనా టాండన్

రీమేక్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న తరువాత నిర్మాత పీవీపీ, చైతును ఒప్పించడానికి చాల రకాలుగా ప్రయత్నాలు చేసి చివరకు సక్సెస్ అయ్యాడు. ఎంతైనా పీవీపీ పక్కా బిజినెస్ మైండెడ్ కదా. మరి అలాంటి పర్సన్, ఈ సినిమా కోసం ఇంత తపన పడుతున్నాడు అంటే.. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఉంది అందరిలో. ఎలాగూ మ్యాటర్ లేకపోతే రూపాయి కూడా పెట్టుబడిగా పెట్టడు పీవీపీ. దీనికితోడు ‘ఓ మై కడవలే’ సబ్జెక్ట్ చైతుకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. యూత్ ను ఆకట్టుకునే కంటెంట్ సినిమాలో దండిగా ఉంటుంది.

Also Read: వాళ్లకి వ్యాపారాన్ని ఇవ్వొద్దు.. ‘పవన్’ మాజీ సతీమణి ఫైర్ !

అనగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు, బ్రేకప్ లు, డైవోర్స్ ఇలాంటి వ్యవహారాలే సినిమాలో మెయిన్ హైలైట్ గా ఉంటాయి. పైగా ఈ జనరేషన్ యువత మనో భావాలకు అద్దం పట్టేలా కథ సాగుతుంది. అందుకే, పీవీపీ ఈ సినిమా రైట్స్ ను తెలుగులోనే కాకుండా వేరే భాషలలో కూడా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. నిజానికి ఈ సినిమా చేస్తారా? అని పీవీపీ మొదట హీరో రామ్ ను అప్రోచ్ అయ్యారు, అయితే రామ్ మాత్రం ఈ సినిమాకి నో చెప్పాడు. అలా ఇప్పుడు ఈ సినిమా చైతు దగ్గరకు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper