Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం సెలబ్రిటీల ట్వీట్లు , పోస్టులతో నిండిపోయింది. సాధారణంగా ఏ హీరో పుట్టినరోజు వచ్చినా , వాళ్ళ అభిమానులకు ఒక పండుగ లాగా ఉంటుంది. కానీ చిరంజీవి పుట్టిన రోజు కేవలం అభిమానులకు మాత్రమే కాదు , సినీ సెలబ్రిటీలకు కూడా పండుగ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ లో స్టార్స్ గా ఎదిగిన వారిలో అత్యధిక శాతం చిరంజీవి అభిమానులే. అయితే అందరి అభిమానం ఒక ఎత్తు , ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అభిమానం మరో ఎత్తు. చిరంజీవి మీద ఒకప్పుడు ఎవరైనా ఏదైనా ఒక విమర్శా చెయ్యాలంటే భయపడేవాళ్లు. ఎందుకంటే ఆయన మీద చిన్న మాట తూలినా పవన్ కళ్యాణ్ అనేటోడు చీల్చి చెండాడుతాడు అనే భయం ఉండేది. ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. అయినప్పటికీ కూడా చిరంజీవి పై చెక్కు చెదరని అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్.
చిరంజీవి టాపిక్ వచ్చినప్పుడు , తాను ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఒక సాధారణ అభిమాని లాగా మారిపోయి , అన్నయ్య పై తనకు ఉన్నటువంటి అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. నేడు తన అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా, పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ ని చదివితే ప్రతీ మెగా అభిమాని కంట నీళ్లు తిరగక తప్పదు. అంతటి ఎమోషనల్ ట్వీట్ అది. ఆయన మాట్లాడుతూ ‘హీరో అవ్వకముందు నుండే నా అన్నయ్య నాకు హీరో. అన్నయ్య తో కలిసి నడిస్తే చాలా గర్వంగా ఉండేది. పెళ్లి అయ్యాక భార్య , పిల్లలు అంటూ మాకు దూరం అవుతాడని అనుకున్నాను. కానీ అన్నయ్య , వదిన నన్ను చెన్నై కి తీసుకెళ్లి , నాపై చూపించిన ప్రేమని మాటల్లో చెప్పలేను’ అంటూ ఎమోషనల్ అయ్యాడు పవన్ కళ్యాణ్.
జీవితం లో అన్నయ్య సాధించలేనిది ఏది లేదు , అన్ని సాధించాడు , అయినప్పటికీ కూడా ఆయన ఈ వయస్సులో కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడు. నా ఏకైక హీరో మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే ఆయన ఈ పోస్ట్ తో ఒక వీడియో ని కూడా అప్లోడ్ చేసాడు. ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసే రోజున , పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ని ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళ్లి , అభిమానులతో అభివాదం చేయించిన ఘటన మెగా ఫ్యాన్స్ కి ఆరోజుల్లో కంటతడి పెట్టించే రేంజ్ ఎమోషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ వీడియో ని అప్లోడ్ చేయడం విశేషం అనుకుంటే , ఆ వీడియో కి ‘జై బాలయ్య’ పాట మ్యూజిక్ ని జత చేయడం మరో విశేషం. ఈ ట్వీట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for… pic.twitter.com/oWMPairQY1
— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2026