Manchu Vishnu- Mohan Babu: టాలీవుడ్ లో ప్రస్తుతం పూర్తిగా మార్కెట్ కోల్పోయిన హీరోలు ఎవరు అంటే మన అందరికీ గుర్తు వచ్చే పేర్లు మంచు కుటుంబ హీరోలు. వీళ్ళ సినిమాలకు షేర్ కలెక్షన్స్ రావడం అనేది కాసేపు పక్కన పెడితే, గ్రాస్ కలెక్షన్స్ కూడా రావడం కష్టమే. ఒకవేళ సినిమా బాగున్నప్పటికీ కూడా కేవలం ఈ హీరోలను చూసి థియేటర్ వైపు కదలని ప్రేక్షకులు ఉన్నారు.
రీసెంట్ గానే మంచు మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా ‘ తో అలాగే మంచు విష్ణు ‘జిన్నా’ చిత్రం తో ఏ రేంజ్ వసూళ్లను సాధించారో , మన కళ్ళతో చూసాము,ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇకనైనా తెలుసుకొని క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి కానీ, లేదా సినీ రంగాన్ని కొద్దిరోజులు పక్కన పెట్టి వేరే ఏదైనా వ్యాపారాలు చూసుకుంటారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు ఒక సెన్సషనల్ న్యూస్ ని మీడియా కి వదిలాడు.
అదేమిటంటే త్వరలోనే మంచు విష్ణు తనని హీరో గా పెట్టి 100 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఒక సినిమా తియ్యబోతున్నాడట. ఈ చిత్రం మొత్తం మోహన్ బాబు స్థాపించిన విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ మీద ఉంటుందట. ఆ యూనివర్సిటీ సాధించిన ఘన విజయాలు, అందులో చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయికి వెళ్లారు, క్రమశిక్షణ విషయం లో విద్యానికేతన్ విద్యాసంస్థలు ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా ఆడియన్స్ కి చూపించే ప్రయత్నం చేస్తున్నారట.
ప్రయత్నం మంచిదే, కానీ అసలు మార్కెట్ లేనప్పుడు వంద కోట్ల రూపాయిలు వృధా చెయ్యడం ఎందుకు?, తక్కువ బడ్జెట్ తో మంచి స్కిల్ ఉన్న డైరెక్టర్ తో తీస్తే అద్భుతమైన ఔట్పుట్ ఇస్తారు కదా, నిజంగానే ఈ సినిమాకి వంద కోట్ల ఖర్చు చేస్తున్నారా?, లేదా పబ్లిసిటీ స్తుంటా అనేది తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీనువైట్ల వ్యవహరించబోతున్నాడని సమాచారం.
Recommended Video: