Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Varanasi Movie Special Role: మహేష్ బాబు 'వారణాసి' మూవీలో ఆ స్పెషల్...

Mahesh Babu Varanasi Movie Special Role: మహేష్ బాబు ‘వారణాసి’ మూవీలో ఆ స్పెషల్ పాత్రలో కనిపించనున్న రాజమౌళి…

Mahesh Babu Varanasi Movie Special Role: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మొదటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన మహేష్ బాబు కి 300 కోట్ల మార్కెట్ కూడా లేదు అలాంటిది ఆయన ఇప్పుడు […]

Mahesh Babu Varanasi Movie Special Role: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మొదటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన మహేష్ బాబు కి 300 కోట్ల మార్కెట్ కూడా లేదు అలాంటిది ఆయన ఇప్పుడు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం చూసిన అతని అభిమానులు ఆనంద పడుతున్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఉన్నాడు కాబట్టే మహేష్ బాబు సినిమాకి 1300 కోట్ల బడ్జెట్ ని కేటాయించి మరి సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజమౌళి సైతం ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడట…ఆయన నటించే పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ అవ్వబోతుందంటు సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

Also Read: పవన్ కళ్యాణ్ తో ‘ధురంధర్ 2’ డైరెక్టర్ ఆదిత్య డర్ భేటీ.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ లోడింగ్..

మహేష్ బాబు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు రాజమౌళి వచ్చి సేవ చేస్తాడట. దాన్ని మొదట వేరే హీరోతో ప్లాన్ చేసినప్పటికి ఆ హీరో ఆ పాత్ర చేయడానికి ఇష్టపడకపోవడంతో రాజమౌళి తనే స్వయంగా ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని తన సన్నిహితులు చెప్పడంతో ఆయన ఆ పాత్రను చేశారట. రాజమౌళి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది…

జక్కన్న మంచి నటుడనే విషయం మనకు తెలిసిందే. ఆయన సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని నటించి చూపిస్తాడు కాబట్టి ఆర్టిస్టులందరు ఆయన చేసే యాక్టింగ్ లో మనం సగం చేసిన కూడా మనకు మంచి గుర్తింపు వస్తుందని చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు రాజమౌళి తెరమీద ఒకటి రెండు సార్లు చిన్న చిన్న పాత్రల్లో కనిపించినప్పటికి తన నటనను పూర్తిస్థాయిలో బయటపెట్టే క్యారెక్టర్ అయితే చేయలేదు.

‘వారణాసి’ సినిమాలో అలాంటి ఒక డిఫరెంట్ రోప్ లో రాజమౌళి నటిస్తుండటం విశేషం… ఇక ఈ సినిమాకి క్యారెక్టర్ ఎంత వరకు హెల్ప్ అవుతుంది. నటనతో మహేష్ బాబుని సైతం డామినేట్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper