Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…కెరియర్ మొదట్లోనే సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన ఆయన ఆ తర్వాత ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టే సినిమాలను చేశాడు. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాలో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపాల్సిన బాధ్యత కూడా రాజమౌళి మీద అలాగే మహేష్ బాబు మీద ఉంది. 1600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. మహేష్ బాబు ప్రపంచ స్థాయి హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నాడనే దానిమీద సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇక మొత్తానికైతే ఆ సస్పెన్స్ కి తెరపడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయితే ఆ వెంటనే ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగా ఒక హీరోను టాప్ లెవల్లో చూపిస్తుంటాడు. అందుకే అతని సినిమాల్లో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు సందీప్ రెడ్డివంగా చాలా తక్కువ సినిమాలతో తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన టాప్ లెవెల్ దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పటికైనా ఆయనతో నటించడానికి మహేష్ బాబు ముందుకు రావడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… మహేష్ బాబు లాంటి నటుడు ఇప్పుడు భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే తన తోటి హీరోలందరు ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్లందరికీ పోటీ ఇవ్వాలంటే మాత్రం మంచి సబ్జెక్టులను ఎంచుకోవాల్సిన అవసరమైతే ఉంది…