Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksh 2: 'అగ్ని పరీక్ష 2' లో చెవులు, ముక్కుపుడక కుట్టించుకున్న మగ...

Bigg Boss Agnipariksh 2: ‘అగ్ని పరీక్ష 2’ లో చెవులు, ముక్కుపుడక కుట్టించుకున్న మగ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Bigg Boss Agnipariksh 2: గత నాలుగైదు రోజుల నుండి ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన ఎపిసోడ్స్ గురించి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో చర్చించుకుంటున్నారు. ‘బిగ్ బాస్’ సీజన్ మొదలు అయితే ఎలాంటి హంగామా ఉంటుందో , అంతకు మించిన హంగామా ఈ ‘అగ్నిపరీక్ష 2’ షో కి జరుగుతోంది. ఎక్కువ శాతం నెగెటివ్ కామెంట్స్ నెటిజెన్స్ నుండి వినిపిస్తున్నాయి కానీ , వ్యూయర్ షిప్ మాత్రం వేరే లెవెల్ లో […]

Bigg Boss Agnipariksh 2: గత నాలుగైదు రోజుల నుండి ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన ఎపిసోడ్స్ గురించి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో చర్చించుకుంటున్నారు. ‘బిగ్ బాస్’ సీజన్ మొదలు అయితే ఎలాంటి హంగామా ఉంటుందో , అంతకు మించిన హంగామా ఈ ‘అగ్నిపరీక్ష 2’ షో కి జరుగుతోంది. ఎక్కువ శాతం నెగెటివ్ కామెంట్స్ నెటిజెన్స్ నుండి వినిపిస్తున్నాయి కానీ , వ్యూయర్ షిప్ మాత్రం వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. అందుకు ముఖ్య కారణం టాస్కులు. ఒక్కొక్క కంటెస్టెంట్ కి జ్యూరీ నిర్వహిస్తున్న టాస్కులు చూస్తుంటే , అసలు వీళ్ళు మనుషులేనా అనే ఫీలింగ్ కలగక తప్పదు. పైగా ఆ టాస్కులు ఆడేందుకు కంటెస్టెంట్స్ ఎగబడడం, తమ వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వడం గమనార్హం. ఈరోజు ఎపిసోడ్ లోని టాస్కులు వర్ణనాతీతం.

ఉదాహరణకు హేమంత్ అనే అబ్బాయి చెవులకు , ముక్కీకి పుడక కుట్టించుకోవడమే. ఈ టాస్క్ కోసం రోహిత్ నాయుడు , హేమంత్ లను ముందుకు రమ్మంటారు జడ్జీలు. ఇద్దరు కుట్టించుకోవడానికి రెడీ అంటారు కానీ శ్రీముఖి ఇక్కడే ఒక ట్విస్ట్ పెడుతుంది. ముక్కు పుడక కుడి , ఎడమ వైపు కాకుండా , మధ్యలో పెట్టించుకోవాలి అంటుంది. అంటే ‘సై’ చిత్రం లో భిక్షు యాదవ్ లాగా అన్నమాట. అందుకు హేమంత్ ఓకే చెప్తాడు , కానీ రోహిత్ నాయుడు మాత్రం నా వల్ల కాదంటూ వెనక్కి వెళ్తాడు. ఇక ముక్కు పుడక కుట్టించుకోవడానికి సిద్దమైన హేమంత్ తో శ్రీముఖి మాట్లాడుతూ ‘మధ్యలో వేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత మాత్రం టాస్కుల పట్ల కమిటెడ్ గా ఉన్నారో తెలుసుకోవడం కోసమే మేము అలా అన్నాము’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. కుట్టించుకుంటున్నప్పుడు నొప్పి ఉన్నప్పటికీ కూడా , ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా కూర్చున్న హేమంత్ ని చూసి జడ్జీలు, శ్రీముఖి ఆశ్చర్యపోయారు.

ఇకపోతే ఈ డేర్ చేయడానికి ఆసక్తి చూపని రోహిత్ నాయుడు ని అందరూ మందలించారు. అసలు ఎందుకు వచ్చావ్ ‘అగ్ని పరీక్ష’ కి అని శ్రీముఖి నిలదీయడం, ఆ తర్వాత నవదీప్ రోహిత్ ఇక్కడికి వచ్చి కూల్ గా కూర్చొని ఆలోచించడానికి వచ్చాడు అంటూ కామెంట్ చేయడం , ఆ తర్వాత అభిజిత్ వాళ్లిద్దరూ నిన్ను రిజెక్ట్ చేసినప్పటికీ , నేను నిన్ను హోల్డ్ లో పెట్టి ఇంత దూరం తీసుకొచ్చాను , కానీ నువ్వు ఇచ్చిన అవకాశాలను కూడా ఉపయోగించుకోవడం లేదు అంటూ మండిపడ్డాడు. కానీ ఆ తర్వాతి రౌండ్ లో రోహిత్ నాయుడు గెలిచాడు. ఇప్పటికీ కూడా అద్భుతంగా టాస్కులు ఆడుతూ తోటి కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నాడట.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper