Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Heroines Career Failure: మహేష్ బాబు తో నటించి కెరియర్ కోల్పోయిన స్టార్...

Mahesh Babu Heroines Career Failure: మహేష్ బాబు తో నటించి కెరియర్ కోల్పోయిన స్టార్ హీరోయిన్స్…

Mahesh Babu Heroines Career Failure: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో భారీ సక్సెస్ లను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకున్న నటులలో మాత్రం మహేష్ బాబు ఒకడినే చెప్పాలి. ఆయన చేసిన సినిమాల్లో ఆయన ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటించిన నటీమణులు స్టార్ హీరోయిన్ […]

Mahesh Babu Heroines Career Failure: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో భారీ సక్సెస్ లను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకున్న నటులలో మాత్రం మహేష్ బాబు ఒకడినే చెప్పాలి. ఆయన చేసిన సినిమాల్లో ఆయన ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటించిన నటీమణులు స్టార్ హీరోయిన్ గా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక కొంతమంది అయితే మహేష్ బాబు పక్కన నటించి తెలుగులో అసలు ఆదరణకు నోచుకోకుండా వేరే ఇండస్ట్రీ కి వెళ్ళిపోయిన వాళ్ళు సైతం ఉన్నారు…

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

జయంత్ సి పరంజి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన ‘టక్కరి దొంగ’ సినిమాలో బిపాసా బసు నటించింది. అయితే ఆమె అప్పటికే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. కానీ తెలుగులో మాత్రం అప్పటివరకు సినిమా చేయలేదు.

మొదటి సినిమాని మహేష్ బాబుతో చేసింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. దాంతో బాలీవుడ్ లోనే సెటిలైపోయింది. ఇక వన్ నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ సైతం తెలుగులోకి అడుగు పెట్టింది.

ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ బాగున్నప్పటికి సినిమా అనుకున్న రేంజ్ లో ఆడకపోవడంతో ఆమెకు అవకాశాలైతే కరువయ్యాయి. నాగచైతన్యతో దోచేయ్ అనే సినిమా చేసినప్పటికి ఆ తర్వాత కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు… ఇక ప్రభాస్ తో ఆది పురుష్ సినిమాలో సీతగా నటించింది. ఆ మూవీ కూడా ఆమెకు అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే ఇవ్వలేక పోయింది.

మొత్తానికైతే ఈ ఇద్దరు హీరోయిన్స్ మహేష్ బాబు పక్కన నటించి వాళ్ళ కెరియర్ ని కోల్పోయారనే చెప్పాలి… ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper