Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అది ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. కాగా ఈ దాడికి సంబంధించి ఎవరికి నచ్చినట్టు వారు సోషల్ మీడియాలో కథనాలు రాస్తున్నారు. దానిపై సేతుపతి స్పందిస్తూ తనదైన స్టైల్ గా ఆన్సర్ కూడా ఇచ్చారు. నిజానికి ఇది చాలా చిన్న ఘటన. కానీ జనాలు దీన్ని చాలా పెద్దదిగా చేస్తున్నారన్నారు. దాడి చేసిన వ్యక్తి తాగిన మైకంలో ఉన్నాడని… జనాలు స్పృహలో లేనపుడు అసాధారణంగా ప్రవర్తిస్తుంటారు అని కూడా చెప్పారు.
అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఏంటంటే ఈ దాడికి పాల్పడిన మహా గాంధీ కూడా తనదైన రీతిలో యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ లు ఇస్తూ ఉండడమే. అయితే ఈ దాడికి పాల్పడిన మహా గాంధీ వరుసగా కన్నడ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తాను కూడా చిన్నపాటి నటుడినే అని, కొన్ని చిత్రాలలో నటించానని గాంధీ చెప్పారు. ఆరోజు ఫ్లైట్ లో విజయ్ సేతుపతితో ప్రయాణం చేశాను అని నేను విష్ చేసినప్పుడు సేతుపతి సరిగ్గా స్పందించలేదని అన్నారు. వారి అసిస్టెంట్ నాతో కొంచెం దురుసుగా ప్రవర్తించారని… అసలు ఎవరు ఎవరితో గొడవ పడింది అనే నిజం తెలియడానికి ఎయిర్ పోర్టు సీసీటీవీ అడిగినట్లు గాంధీ తెలిపారు. అయితే విజయ్ సేతుపతి నటన అంటే తనకు ఇష్టమని చెప్పడం గమనార్హం. విజయ్ ఎటువంటి వ్యక్తో అందరికీ తెలిసిందే… అలాంటి వ్యక్తిపై తాగి అలా ప్రవర్తించిన అతన్ని కూడా పిలిచి ఇంటర్వ్యూలు చేసిన ఆ యూట్యూబ్ ఛానల్స్ పై పలువురు మండి పడుతున్నారు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం మరి ఇంత దిగజారోద్దని చెబుతున్నారు.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More