Samantha: నాగచైతన్యతో విడిపోయాక సమంత ఒంటరిగా ఫీల్ అవుతోంది. ఆ బాధ నుంచి దిగమింగుకోవడానికి ఇతర వ్యాపకాలతో బీజీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఛార్ ధామ్ యాత్ర చేసి ఆధ్యాత్మిక యాత్రతో సేదతీరింది.

ఇక చైతన్య వివాహ జ్ఞాపకాలను మరిచిపోవడానికి ఒంటరిగా ఉండకుండా స్నేహితులతో సమంత గడుపుతోంది. ఎక్కువగా తన క్లోజ్ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తోంది. వరుసగా సినిమాను సైన్ చేసి బిజీగా ఉంటోంది.
స్నేహితులతో కలిసి సమంత ప్రస్తుతం సరదాగా గడుపుతోంది. తాజాగా సమంత తన ఫ్రెండ్ గురించి సంచలన పోస్ట్ పెట్టింది. అదిప్పుడు వైరల్ గా మారింది.
తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ మంజుల అనగాని బర్త్ డేకు సమంత హాజరైంది. వారితో దిగిన ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నీలాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నా.. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్న ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు.. హ్యాపీ బర్త్ డే’ అంటూ సమంత ఎమోషనల్ అయ్యింది.
డాక్టర్ మంజుల బర్త్ డే పార్టీ ఘనంగా జరిగింది. దీనికి డైరెక్టర్ నందిని రెడ్డి, హీరోయిన్ మాళవిక, సమంత హాజరయ్యారు. ఈ పిక్ షేర్ చేసి తన బెస్ట్ ఫ్రెండ్ గురించి గొప్పగా సమంత చెప్పుకొచ్చింది.