spot_img
Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other Elimination: ఈ వారం 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' నుండి...

Mad For Each Other Elimination: ఈ వారం ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ నుండి ఎలిమినేట్ అయిన మరో టాప్ జంట.. ఆడియన్స్ ఓట్లు వృధా..

Mad For Each Other Elimination: రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ మంచి రేటింగ్స్ తో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆరంభం లో ఈ షో ఆడియన్స్ కి కాస్త సోదిగానే అనిపించింది. కానీ వారాలు గడిచే కొద్దీ షోలో జంటల మధ్య గొడవలు జరగడం , కఠినమైన టాస్కులు జరుగుతూ ఉండడం వల్ల , ఈ షోకి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ రావడం మొదలైంది. కానీ షోలో జరుగుతున్న ఎలిమినేషన్స్ ఆడియన్స్ కి చాలా అన్యాయం అనిపిస్తోంది. ముందుగా ఈ షోలో ఆడియన్స్ ఓటింగ్ అనే ఛాయస్ పెట్టలేదు. కంటెస్టెంట్స్ గేమ్స్ ద్వారా ఆడి సంపాదించిన బాండ్ క్రెడిట్స్ ద్వారా మాత్రమే ఎలిమినేషన్స్ ప్రక్రియ ఉండేది. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసేసారు, ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు.

అయినప్పటికీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పెట్టారు. ఇప్పుడు ఆడియన్స్ వేసే ఓట్లు వృధా అయ్యినట్టే కదా. ఇకపోతే ఈ వారం ఎలిమినేట్ అయిన జంట ఆమిర్ – అభిమానిక . వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జంట , మొదటి వారం లో కాస్త తడబడిన విషయం వాస్తవమే. కానీ రెండవ వారం నుండి తమ ఆట తీరుని మార్చుకొని బాగా డెవలప్ అయ్యారు. కానీ ఈ వారం అందరికంటే తక్కువ బంద్ క్రెడిట్స్ ఉండడం వల్ల, ఈ జంట అంజలి – పవన్ జంట తో ఫేస్ ఆఫ్ రౌండ్ కి వచ్చి , ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్, వీళ్ళు కచ్చితంగా హౌస్ లో ఉండాల్సిన వాళ్ళే అని అంటున్నారు. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ లో వీక్ కంటెస్టెంట్ ఎవరు అనే రౌండ్ పెడితే హౌస్ లోని జంటలంతా కలిసి మహేష్ – సాండ్రా , అంజలి – పవన్ పేర్లు చెప్పారు.

మహేష్ – సాండ్రా కచ్చితంగా అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు , అందులో ఎలాంటి సందేహం లేదు , అయినప్పటికీ ఆ జంట హౌస్ లోని మిగతా జంటలకు సాఫ్ట్ టార్గెట్ అవుతోంది అని చాలా మందికి అనిపిస్తోంది. ఇక అంజలి, పవన్ జంట విషయానికి వస్తే , వీళ్ళు కచ్చితంగా ఎలిమినేట్ అవ్వడానికి అర్హులు. ఎందుకంటే ప్రతీ వారం వీళ్ళు డేంజర్ జోన్ లోకి వస్తున్నారు, గేమ్స్ కూడా కసిగా ఆడడం లేదు. ఆడియన్స్ ఓటింగ్ కి విలువ ఇస్తే కచ్చితంగా ఈ జంట ని ఎలిమినేట్ చెయ్యాలి. కానీ వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, వీక్ జంట అని అనిపించుకోని ఆమిర్ – అభిమానికా జంటని ఎలిమినేట్ చేయడం అన్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper