Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha 2: 'అగ్నిపరీక్ష 2' ప్రారంభం తేదీ వచ్చేసింది.. ఈసారి టీవీ టెలికాస్ట్...

Bigg Boss Agnipariksha 2: ‘అగ్నిపరీక్ష 2’ ప్రారంభం తేదీ వచ్చేసింది.. ఈసారి టీవీ టెలికాస్ట్ కూడా.. పూర్తి వివరాలు మీకోసం..

Bigg Boss Agnipariksha 2: ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. అందుకు కారణం ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని రావడం , వాళ్ళు అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం , ఆ కారణం […]

Bigg Boss Agnipariksha 2: ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. అందుకు కారణం ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని రావడం , వాళ్ళు అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం , ఆ కారణం చేత ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవడం , మరో సామాన్యుడు టాప్ 3 గా నిలవడం , ఇలాంటి సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ కాన్సెప్ట్ పెద్ద హిట్ అవ్వడం తో , రెండవ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. ఈ ఏడాది మొదలై 5 నెలలు పూర్తి కావొస్తుంది , కానీ ఇప్పటి వరకు ఈ సీజన్ పై ఎలాంటి అప్డేట్ రాకపోవడం తో అసలు ‘అగ్ని పరీక్ష 2’ ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.

కానీ మీరు అందరూ ఎదురు చూస్తున్న అప్డేట్ త్వరలోనే రాబోతుంది. ఈ సీజన్ జూన్ నెలాఖరు నుండి మొదలు కాబోతుంది అట. ఈ నెలలో ‘అగ్ని పరీక్ష 2’ కి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా చేయబోతున్నారట. ఈసారి పోటీ భారీ రేంజ్ లో ఉంటుంది కాబట్టి, టాస్కులు కూడా చాలా కఠినంగా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ రియాలిటీ షో లో కూడా చూడని రేంజ్ టాస్కులను ఈ షో లో డిజైన్ చేస్తున్నారట. ఇక జడ్జీలుగా ఈసారి వేరే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. గత సీజన్ లో వచ్చిన నవదీప్ కొనసాగే అవకాశం ఉందట, అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల కూడా ఈ షో లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే ఆయన జడ్జీ గా కాదు , టీం లీడ్ గా ఉంటారట. ఆడిషన్స్ ద్వారా ఎంపికైన కంటెస్టెంట్స్ ని నాలుగు టీమ్స్ గా చేసి , వాటికి టీం లీడ్స్ ని కూడా పెట్టబోతున్నారట. అందులో ఒక టీం కి కళ్యాణ్ పడాల, మరో టీం కి తనూజ , మిగిలిన రెండు టీమ్స్ కి కూడా గత సీజన్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారని తెలుస్తుంది. ఇకపోతే శివాజీ ఈ సీజన్ లో ఒక జడ్జీగా వ్యవహరించబోతున్నట్టు టాక్. కనీవినీ ఎరుగని రీతిలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట మాకెర్స్. ఈ సీజన్ కేవలం హాట్ స్టార్ లో మాత్రమే కాకుండా, టీవీ లో కూడా టెలికాస్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper