Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other show : 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' షో టైటిల్...

Mad For Each Other show : ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో టైటిల్ గెలుచుకున్న జంట అదే.. ఇది చాలా అన్యాయం..

Mad For Each Other show : రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ షో మరో రెండు వారాల్లో ముగియబోతుంది. బిగ్ బాస్ కాకుండా, మరో రియాలిటీ షో అంటే ఆడియన్స్ మొదట్లో బాగా ఆసక్తి చూపించారు , కాన్సెప్ట్ బాగుంది, కంటెస్టెంట్స్ కూడా మంచి ఇస్తున్నారు, కానీ షో మాత్రం పూర్తిగా జనల ఇష్టానికి వ్యతిరేకంగా సాగుతోంది. మ్యాన్షన్ లోపల కష్టపడే కంటెస్టెంట్స్ కి […]

Mad For Each Other show : రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ షో మరో రెండు వారాల్లో ముగియబోతుంది. బిగ్ బాస్ కాకుండా, మరో రియాలిటీ షో అంటే ఆడియన్స్ మొదట్లో బాగా ఆసక్తి చూపించారు , కాన్సెప్ట్ బాగుంది, కంటెస్టెంట్స్ కూడా మంచి ఇస్తున్నారు, కానీ షో మాత్రం పూర్తిగా జనల ఇష్టానికి వ్యతిరేకంగా సాగుతోంది. మ్యాన్షన్ లోపల కష్టపడే కంటెస్టెంట్స్ కి విలువ లేదు, కేవలం కొందరి మీద మాత్రమే పక్షపాతం చూపిస్తూ మిగతా వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ షో మొదలైనప్పటి నుండి , ఇప్పటి వరకు ఈయన నిర్వాహకులపై , కంటెస్టెంట్స్ పై నోర్లు జారుతూనే ఉన్నాడు. ఎన్ని సార్లు ఆయన్ని జడ్జీలు వారించినా వినడంలేదు, ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదు.

అయితే జడ్జీలు ఆయన డేంజర్ జోన్ లోకి వచ్చినప్పుడల్లా ‘నో ఎలిమినేషన్’ పెట్టి సేఫ్ చేయడం , ఇతర కంటెస్టెంట్స్ కి అన్యాయం చేయడం ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చడం లేదు. గతం లో కూడా ఇలాగే చేశారు. డేంజర్ జోన్ లోకి వచ్చిన నటరాజ్ మాస్టర్ – నీతూ , అంజలి – పవన్ లకు ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో నటరాజ్ మాస్టర్ ఓడిపోతాడు. న్యాయంగా అయితే నటరాజ్ మాస్టర్ ని ఆరోజు ఎలిమినేట్ చెయ్యాలి, కానీ ఆరోజు ఎలిమినేషన్ ని రద్దు చేశారు , పక్క వారం మంచి టాప్ జోడిగా పేరు తెచ్చుకున్న సంధ్య – బ్రిట్టూ జంటని ఎలిమినేట్ చేశారు. వీళ్ళు ఎలిమినేట్ అయ్యినప్పుడు హౌస్ లో ఉన్నవాళ్ళంతా ఎంత బాధపడ్డారో , ఆడియన్స్ కూడా అంతే బాధ పడ్డారు. ఎలిమినేట్ అవ్వాల్సిన నటరాజ్ మాస్టర్ కి తనని తానూ నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం వచ్చింది.

కానీ ఇప్పటి వరకు ఆయన గోల్డెన్ కపుల్ అవ్వలేకపోయాడు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్లీ మ్యాన్షన్ లోకి అడుగుపెట్టిన మహేష్ – సాండ్రా జంట కూడా తమని తాము రీ ఎంట్రీ లో నిరూపించుకున్నారు. మొదటి రోజు నుండే అద్బుతంగా గేమ్స్ ఆడుతూ , నేడు మొదటి ఫైనలిస్ట్ గా ఈ జంట నిలబడడమే కాకుండా, చివరి గోల్డెన్ కపుల్ గా అరుదైన అవకాశాన్ని సంపాదించుకున్నారు. కానీ నటరాజ్ – నీతూ జంట మాత్రం నిరూపించుకోలేదు. ఈ వారం ఎలిమినేషన్ ని రద్దు చేసి , వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. అంటే వచ్చే వారం సిద్దు – సోనియా, అభిమానిక – ఆమీర్ జంటలు ఎలిమినేట్ అవ్వబోతున్నాయి అన్నమాట. ఇలా నటరాజ్ మాస్టర్ కి అనుకూలంగా గేమ్ మార్చి , చివరికి టైటిల్ కూడా ఈ జంటకు ఇచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారేమో అని అంటున్నారు నెటిజెన్స్.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper