Mad For Each Other elimination : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో ఇప్పుడు చివరి లెవెల్ కి చేరింది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే తో ఈ షో ముగియబోతుంది. ఈ షో లో ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ ఏది కూడా ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. బాగా ఆడే జంటలు చాలానే ఎలిమినేట్ అయ్యాయి. ఈ కారణం చేత , ఆడియన్స్ లో ఈ షో తీవ్రమైన నెగెటివిటీ ని ఏర్పాటు చేసుకుంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కి వచ్చిన ప్రతీ వారం ఎలిమినేషన్ ని రద్దు చేయడం , అతని ఎన్ని మాటలు మాట్లాడినా బాండ్ క్రెడిట్స్ ఇవ్వడం వంటివి చేస్తూ వచ్చారు జడ్జీలు. ముఖ్యంగా షో ఫార్మటు పై ఇతను చేసినన్ని కామెంట్స్ ఇప్పటి వరకు ఏ జంట కూడా చేయలేదు.
ఏ షో ద్వారా అయితే పాపులారిటీ ని సంపాదించుకున్నాడో , అదే షో పై పదే పదే విమర్శలు చేస్తున్నా కూడా ఆయన్ని సింహం అంటూ పిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత వారం ఎలిమినేషన్ ని రద్దు చేయడం వల్ల, ఈ వారం బాగా జంటలు ఎలిమినేట్ అవ్వబోతున్నాయి. అందులో మొదటి జంట సిద్దు – సోనియా. ఈ జంటకు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ఉంది , వాళ్ళ ఆట తీరుని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ వీళ్ళు ఈ వారం ఆటల్లో డేంజర్ జోన్ లోకి వచ్చారు , ఆ కారణం చేత ఎలిమినేట్ అవ్వబోతున్నారు. వీళ్ళు ఈ వారం గేమ్స్ ఓడిపోయింది నటరాజ్ మాస్టర్ -నీతూ జంట చేతుల్లోనే. వీళ్ళు గత వారమే ప్రక్రియ ప్రకారం ఎలిమినేట్ అయ్యుంటే , నేడు సిద్దు – సోనియా లాంటి టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యేవాళ్ళు కాదు కదా.
అదే విధంగా వీళ్ళతో పాటు ఎలిమినేట్ అవ్వబోయే మరో జంట ఆమీర్ – అభిమానికా . వీళ్ళు ఈ వారం టాస్కులు గెలిచారు , అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఇలా అన్యాయమైన ఎలిమినేషన్స్ చేస్తూ , షో ఆసక్తికరంగా సాగుతున్నప్పటికీ కూడా , తీవ్రమైన నెగెటివిటీ ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. మేకర్స్ తీరు చూస్తుంటే నటరాజ్ మాస్టర్ చేతుల్లోనే కప్ పెట్టెలాగా ఉన్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు, చూడాలి మరి వచ్చే వారం ఏమి జరగబోతుంది అనేది.
