spot_img
Homeఎంటర్టైన్మెంట్Macherla Niyojakavargam Trailer: ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ ట్రైలర్ లో హైలైట్స్ ఇవే.. ...

Macherla Niyojakavargam Trailer: ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ ట్రైలర్ లో హైలైట్స్ ఇవే.. పీకలు కోస్తాడట, ఇక కేకలే !

Macherla Niyojakavargam Trailer: నితిన్ హీరోగా ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు తీస్తున్న నితిన్.. ఈ చిత్రంపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ట్రైలర్‌కు సర్వం సిద్ధం అంటూ మాస్‌ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

ఇటీవ‌లే విడుద‌లైన గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఇప్పుడు ట్రైలర్‌ కూడా అకట్టికుంటే.. సినిమాకి ఉన్న హైప్ డబుల్ అవుతుంది. అందుకే.. ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ టీమ్.. ట్రైలర్ చాలా బాగా కట్ చేసిందట. ట్రైలర్ లో నితిన్ కత్తి పట్టుకుని రౌడీల పీకలను కోస్తూ కనిపిస్తాడట.

Macherla Niyojakavargam Trailer
Macherla Niyojakavargam

అలాగే ఈ సినిమా ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ అని తెలియజేసేలా ట్రైలర్ లో ఎలివేషన్ షాట్స్ ను ప్లాన్ చేశారు. పాపం.. ఎప్పటి నుంచో నితిన్‌ మాస్ హీరో అవాలని చాలా ఆశ పడుతున్నాడు. ఆ ఆశతోనే మధ్యలో కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ కూడా చేసి చేతులు కాల్చుకున్నాడు.

ఇప్పటివరకు వచ్చిన చిత్రాలన్నిటిలో నితిన్ నటన పై రివ్యూ చేస్తే.. నితిన్ పై మాస్ ఎలిమెంట్స్ వర్కౌట్ కావడం లేదు, ఇక కావు అని తేలిపోయింది. నిజానికి నితిన్ కి ల‌వ్ స్టోరీలు చాలా బాగా సెట్ అవుతాయి. కాకపోతే, నితిన్ కి ఉన్న ఏకైక కోరిక.. మాస్ హీరో అవాలని. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

ఈ క్రమంలోనే మాస్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ చేశాడు. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాదిలో నితిన్ మూడు చిత్రాలు చేశాడు. ‘రంగ్ దే’, ‘చెక్’, ‘మాస్ట్రో’… ఈ మూడు హిట్ కాలేకపోయాయి. మొత్తానికి నితిన్ కి 2021 పూర్తిగా కలసిరాలేదు. మరి ఈ 2022 అయినా కలిసి వస్తోందేమో చూడాలి.

Macherla Niyojakavargam Trailer
Nithin

కాకపోతే.. ఈ సినిమాకి ఒక సమస్య వచ్చింది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఎంఎస్ రాజ‌శేఖర్ రెడ్డి పై సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఎంఎస్ రాజ‌శేఖర్ రెడ్డి గతంలో కులాల పేరిట చేసిన ట్వీట్స్ ఇప్పుడు ఈ సినిమాకి శాపంగా మారాయి. ఈ రోజు ఎంఎస్ రాజ‌శేఖర్ రెడ్డి హైద‌రాబాద్‌లోని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను కూడా ఆశ్ర‌యించాడు. త‌నపై సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, దానికి కార‌కులైన వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సైబ‌ర్ క్రైమ్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశాడు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

US Iran War

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...
US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
Oktelugu Epaper