Homeఎంటర్టైన్మెంట్Lenin Movie: 'లెనిన్' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత గ్రాస్ రావాలో తెలుసా.. బయ్యర్స్...

Lenin Movie: ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత గ్రాస్ రావాలో తెలుసా.. బయ్యర్స్ పెద్ద సాహసమే చేశారు..

Lenin Movie: అక్కినేని అఖిల్ కెరీర్ లో ‘లెనిన్’ చిత్రం ఎంతో ప్రత్యేకం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని , ఈసారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలి అనే కసితో ఈ చిత్రాన్ని చేశాడు . ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా , ఇప్పటికీ సరైన హిట్ లేకపోవడం తో , అక్కినేని అభిమానులు అఖిల్ పట్ల తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. పాపం ప్రతీ సినిమాకు అఖిల్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు […]

Lenin Movie: అక్కినేని అఖిల్ కెరీర్ లో ‘లెనిన్’ చిత్రం ఎంతో ప్రత్యేకం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని , ఈసారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలి అనే కసితో ఈ చిత్రాన్ని చేశాడు . ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా , ఇప్పటికీ సరైన హిట్ లేకపోవడం తో , అక్కినేని అభిమానులు అఖిల్ పట్ల తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. పాపం ప్రతీ సినిమాకు అఖిల్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు , కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు అనే భావన కేవలం అక్కినేని ఫ్యాన్స్ లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఉంది. అందుకే తప్పుల నుండి అఖిల్ చాలా నేర్చుకున్నారని , ఈసారి ఆయన టార్గెట్ మిస్ అయ్యే అవకాశం లేదని అక్కినేని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు , ట్రేడ్ కూడా అఖిల్ ని ఈసారి గట్టిగానే నమ్ముతోంది.

అందుకే తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ ని జరుపుకుంటుంది ఈ చిత్రం. కేవలం ఒక్క కోస్తాంధ్ర ప్రాంతం లోనే ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ‘ఏజెంట్’ లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత ఈ రేంజ్ బిజినెస్ జరగడం అనేది చిన్న విషయం కాదు. ఇక నైజాం , సీడెడ్ ప్రాంతాలకు కలిపి కచ్చితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండే 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకునే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రెండ్ నడుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కెరీర్ మొత్తం మీద ఒక్క హిట్ సరైనది లేదు, గత చిత్రం ఆల్ట్రా డిజాస్టర్, అయినప్పటికీ ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే , అఖిల్ ని ఈసారి ట్రేడ్ చాలా గట్టిగా నమ్ముతుందని అర్థం.

ఇప్పటి వరకు విడుదలైన ప్రీ రిలీజ్ ప్రొమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి , ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అఖిల్ తండ్రి నాగార్జున ఈ చిత్రాన్ని చూసి పుత్రోత్సాహం తో మురిసిపోతున్నారు. చూస్తుంటే అఖిల్ ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ చిత్రం విడుదలై నేటికి నాలుగు రోజులు అయ్యుండేది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పర్ఫెక్షన్ కోసం జులై 10 కి వాయిదా వేశారు. మరి అఖిల్ ఈసారైనా అంచనాలను అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper