Homeఎంటర్టైన్మెంట్Lenin 2 Weeks Collections: 'లెనిన్' 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో ఆగిపోయేలా ఉందే..

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి 14 వ రోజున కూడా తెలుగు రాష్ట్రాల నుండి 31 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చాయట. నైజాం ప్రాంతం నుండి నిన్నటి రోజున […]

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి 14 వ రోజున కూడా తెలుగు రాష్ట్రాల నుండి 31 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చాయట. నైజాం ప్రాంతం నుండి నిన్నటి రోజున 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. నిన్న ‘జన నాయకుడు’ చిత్రం విడుదలైనప్పటికీ కూడా ఈ చిత్రానికి ఈ రేంజ్ షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి రావడం మామూలు విషయం కాదు. ఓవరాల్ గా 14 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం నుండి 13 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 3 కోట్ల 79 లక్షల రూపాయిల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఒకప్పుడు సినిమాలకు ఉత్తరాంధ్ర కంటే సీడెడ్ ప్రాంతం లోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. కానీ ఈమధ్య వచ్చే సినిమాలకు ఉత్తరాంధ్ర వసూళ్లు , సీడెడ్ కంటే ఎక్కువ ఉన్నాయి. లెనిన్ కి కూడా అదే పరిస్థితి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 14 రోజుల్లో 4 కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇక ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే తూర్పు గోదావరి నుండి 2 కోట్ల 58 లక్షలు , పశ్చిమ గోదావరి నుండి 1 కోటి 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.

అదే విధంగా గుంటూరు నుండి 2 కోట్ల 30 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 1 కోటి 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇక నెల్లూరు జిల్లా నుండి అయితే 1 కోటి 13 లక్షల షేర్ వచ్చినట్టు సమాచారం. ఇక్కడ దాదాపుగా థియేట్రికల్ రన్ ముగిసినట్టే. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 30 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 52 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 37 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 68 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే , ఇప్పటి వరకు 15 కోట్ల 22 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. కానీ 100 కోట్ల గ్రాస్ టార్గెట్ ని మాత్రం అందుకోవడం అసాధ్యం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper