Homeఎంటర్టైన్మెంట్Lenin Movie Collections: ఆ ఒక్క ప్రాంతంలో 'మా ఇంటి బంగారం' మొదటిరోజు వసూళ్లను అందుకోలేకపోయిన...

Lenin Movie Collections: ఆ ఒక్క ప్రాంతంలో ‘మా ఇంటి బంగారం’ మొదటిరోజు వసూళ్లను అందుకోలేకపోయిన ‘లెనిన్’..

Lenin Movie Collections: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన సమంత ‘మా ఇది బంగారం’ చిత్రం కమర్షియల్ గా ఎంత బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం. ఓపెనింగ్స్ నుండి ఫుల్ రన్ వరకు ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ వసూళ్లను చూసి ట్రేడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఎందుకంటే ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు నమోదు అయ్యి చాలా రోజులైంది. అయితే సోషల్ మీడియా లో […]

Lenin Movie Collections: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన సమంత ‘మా ఇది బంగారం’ చిత్రం కమర్షియల్ గా ఎంత బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం. ఓపెనింగ్స్ నుండి ఫుల్ రన్ వరకు ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ వసూళ్లను చూసి ట్రేడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఎందుకంటే ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు నమోదు అయ్యి చాలా రోజులైంది. అయితే సోషల్ మీడియా లో ఈ సినిమా రికార్డ్స్ ని అందుకోవడం అక్కినేని ఫ్యామిలీ కి ఒక డ్రీం , లాంగ్ రన్ లో అందుకోవచ్చేమో కానీ , ఓపెనింగ్స్ ని మాత్రం అందుకోలేరని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే నిన్న అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది.

విడుదలకు ముందు ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ‘మా ఇంటి బంగారం’ కంటే తక్కువ గ్రాస్ నమోదైంది. దీంతో ప్రతీ ఒక్కరు కచ్చితంగా ఈ చిత్రం ఓపెనింగ్స్ లో మా ఇంటి బంగారం ని అందుకోలేదని అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ సినిమా వసూళ్లను అవలీలగా దాటేసింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ‘లెనిన్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 7 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూలు రాగా , ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి 6 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘లెనిన్’ చిత్రానికి మొదటి రోజున 5 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా , సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి 2 కోట్ల 22 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే లెనిన్ డబుల్ మార్జిన్ తో మా ఇంటి బంగారం ని కొట్టింది అన్నమాట.

అయితే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాల్లో ‘మా ఇంటి బంగారం’ చిత్రం తిరుగులేని ఆధిక్యతతో ఉంది. లెనిన్ చిత్రానికి రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కేవలం 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘మా ఇది బంగారం’ చిత్రానికి 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. లెనిన్ చిత్రం కచ్చితంగా వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అవుతుంది , అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ గా నిలుస్తుంది , అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఫుల్ రన్ లో ప్రస్తుతానికి అయితే ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం కష్టమే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper