spot_img
Homeఎంటర్టైన్మెంట్Koratala Siva- NTR: ఎట్టకేలకు ఎన్టీఆర్ పై యాక్షన్ చెప్పనున్న కొరటాల!

Koratala Siva- NTR: ఎట్టకేలకు ఎన్టీఆర్ పై యాక్షన్ చెప్పనున్న కొరటాల!

Koratala Siva- NTR: ఎన్టీఆర్ 30కి ఎట్టకేలకు ముహూర్తం కుదిరందని తెలుస్తుంది. 2023 ప్రారంభంలోనే టైం ఫిక్స్ చేశారట. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారట. ఆర్ ఆర్ ఆర్ విడుదలై తొమ్మిది నెలలు కావస్తోంది. ఎన్టీఆర్ కొత్త చిత్రం స్టార్ట్ చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ చిత్ర మరో హీరో రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో మూవీ స్టార్ట్ చేసి 50 శాతానికి పైగా పూర్తి చేశారు కూడా. ఎన్టీఆర్, కొరటాల శివ మాత్రం మీన మేషాలు లెక్కబెడుతున్నారు. ఎన్టీఆర్ 30పై పెద్ద మొత్తంలో అయోమయం నెలకొంది. పలు పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఒక దశలో ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం జరిగింది.

Koratala Siva- NTR
Koratala Siva- NTR

ప్రీప్రొడక్షన్ కి సంబంధించిన ఫోటోలు విడుదల చేసి కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ 30 రద్దయ్యిందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చాడు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంపై క్లారిటీ లేదు. అయితే పరిశ్రమ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. జనవరిలో సంక్రాంతి పండగ దినాన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారట. ఇక రెగ్యులర్ షూట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందట.

లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి త్వరితగతిన షూట్ పూర్తి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. కొరటాల శివ మూవీ స్టార్ట్ అయితే ఎన్టీఆర్ కి తీరిక కూడా దొరకదట. ఈ కారణంతోనే ఫ్యామిలీతో అమెరికా వెకేషన్ ప్లాన్ చేశారు అంటున్నారు. ఇటీవల ఎన్టీఆర్ భార్య పిల్లలతో అమెరికా వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే ప్లాన్ చేశారట. దాదాపు ఒక నెల రోజులు ఎన్టీఆర్ అమెరికాలోనే ఉండనున్నారని సమాచారం. టూర్ నుండి వచ్చిన వెంటనే కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది.

Koratala Siva- NTR
Koratala Siva- NTR

కొరటాల భారీ పాన్ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ప్రీలుక్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ అంచనాలు పెంచాయి. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ తో జతకట్టే హీరోయిన్ ఎంపిక జరగలేదు. ఆ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. జాన్వీ కపూర్, రష్మిక మందానతో పాటు పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. కొరటాల మూవీ అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నారు. సలార్ షూట్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్… సలార్ విడుదల తర్వాత ఎన్టీఆర్ 31 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. స్క్రిప్ట్ ఆల్రెడీ సిద్ధంగా ఉందని వినికిడి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper