Samantha: సమంత కెరీర్ జోరు మీదుంది. ఈ చెన్నై భామ పరిశ్రమలో 12 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారు. టాలెంట్-లక్ కలిగిన రేర్ హీరోయిన్ సమంత. అందుకే ఆమెకు తిరుగులేకుండా పోయింది. మొదటి చిత్రం ఏమాయ చేశావే నుండి యశోద వరకు సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. సమంత కెరీర్ ఏనాడూ నెమ్మదించలేదు. కారణం… విజయాల శాతం చాలా ఎక్కువ. సమంత నటించిన చిత్రాల్లో పరాజయం పొందినవి చాలా తక్కువ. సమంత హీరోయిన్ గా చేస్తే హిట్ గ్యారెంటీ అనే ఒక సెంటిమెంట్ పరిశ్రమలో బలపడింది.

ఇన్నేళ్ల కెరీర్లో సమంత యాభైకి పైగా చిత్రాలు చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సమంత నటిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై కూడా సమంత తన మార్క్ క్రియేట్ చేశారు. సమంత ప్రధాన పాత్ర చేసిన ది ఫ్యామిలీ మాన్ 2 మంచి విజయం సాధించింది. ఈ యాక్షన్ క్రైమ్ సిరీస్ సమంతకు బాలీవుడ్ వర్గాల్లో పేరు తెచ్చింది. ది ఫ్యామిలీ మాన్ 2 తర్వాత సమంతకు హిందీలో ఆఫర్స్ వస్తున్నాయి.
సమంత దేశంలోనే టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె సినిమాకు రూ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటున్నారట. అయితే ఆమెకు డబ్బు అంటే అంత పిచ్చి లేదని చెప్పడం విశేషం. నాకు డబ్బుపై వ్యామోహం లేదు. డబ్బుల కోసం నచ్చని రోల్స్ చేయను. సినిమాలో నా రోల్ నచ్చితేనే చేస్తాను. డబ్బులు వస్తాయి కదా అని చెత్త రోల్స్ చేయను అని సమంత కుండబద్దలు కొట్టారు. అయితే సమంత స్టేట్మెంట్ గతంలో చెప్పిన దానికి భిన్నంగా ఉంది.

కెరీర్ బిగినింగ్ లోనే సమంత హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక చిత్ర విజయంలో హీరో ప్రమేయం ఎంత ఉంటుందో హీరోయిన్ ప్రమేయం కూడా అంతే ఉంటుంది. అలాంటప్పుడు రెమ్యూనరేషన్స్ లో భారీ వ్యత్యాసం ఎందుకు ఉంటుందని, నేరుగా ప్రశ్నించారు. అప్పట్లో సమంత కామెంట్స్ సంచలనం రేపాయి. అయితే ఇన్నేళ్ల కెరీర్లో సమంత రెమ్యూనరేషన్ కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు రాలేదు. కాగా సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఖుషి, శాకుంతలం చిత్రాల్లో నటిస్తున్నారు.