Homeఎంటర్టైన్మెంట్Shock To Tarak Fans: తారక్ ఫాన్స్ కి కోలుకోలేని షాక్ KGF డైరెక్టర్ ప్రశాంత్...

Shock To Tarak Fans: తారక్ ఫాన్స్ కి కోలుకోలేని షాక్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Shock To Tarak Fans: RRR మూవీ భారీ విజయం తో ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 20 వ తారీఖున ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా తెలియచేయనున్నారు ఆ చిత్ర నిర్మాతలు..అంతే కాకుండా ఎన్టీఆర్ త్వరలో KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఈ నెల 20 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు అనే వార్త అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపింది..అయితే రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త , ఎన్టీఆర్ అభిమానులను కలవర పెడుతుంది..

KGF Director Prashant Neel Shock To Tarak Fans
Jr NTR

Also Read: KCR BJP Congress: కేసీఆర్ టార్గెట్ ఫిక్స్.. బీజేపీ కూడా అదే దారి.. కాంగ్రెస్ కు ఏంటీ పరిస్థితి?

అదేమిటి అంటే KGF నిర్మాతలు ఈ ఏడాది చివరి నుండి KGF చాప్టర్ 3 షూటింగ్ ప్రారంభం అవుతుంది అని అధికారికంగా ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో ప్రకటించారు ..ప్రస్తుతం సలార్ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమా పూర్తి అవ్వగానే KGF చాప్టర్ 3 షూటింగ్ ని ప్రారంభిస్తారు అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం..దీని వల్ల ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయమే పటేటట్టు ఉంది..KGF చాప్టర్ 3 సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అయ్యే సమయానికి 2024 వరుకు సమయం పట్టొచ్చు..అప్పటి వరుకు ఎన్టీఆర్ అభిమానులు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎదురు చూడక తప్పదు..దీనితో అసలు ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే భయం ఎన్టీఆర్ అభిమానుల్లో నెలకొంది..

Prashanth Neel

ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందో అని వార్త వినాల్సి వస్తుందో అని ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు..ఎందుకంటే గతం లో కూడా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది..అలా ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అవుతుందేమో అనే భయం లో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.

Also Read: Pranitha Subhash Seemantham: పసుపు పచ్చని చీరలో బాపు బొమ్మకు సీమంతం

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular