Homeఎంటర్టైన్మెంట్Shilpa Shetty: కమ్మని అమ్మతనాన్ని చూపించిన 'శిల్పా శెట్టి' !

Shilpa Shetty: కమ్మని అమ్మతనాన్ని చూపించిన ‘శిల్పా శెట్టి’ !

Shilpa Shetty: తన గారాల తనయ పాదాలు నేలకు తాకకుండా హీరోయిన్ ‘శిల్పా శెట్టి’ కమ్మని అమ్మతనాన్ని చూపించింది. ఈ సమస్త సృష్టిలో దేవ‌త‌ల‌కు కూడా ద‌క్క‌ని అపూర్వ అనుభూతి అమ్మ. ఈ లోకమంతా మాతృత్వం మీదే ఆధారపడి నడుస్తోంది. అందుకే, భూమ్మీద అన్నీ ప్రేమ‌ల‌క‌న్నా అమ్మ ప్రేమ మిన్నా అన్నారు. అలాంటి అమ్మ ప్రేమను వ‌ర్ణించ‌లేం. ఆడవాళ్ళల్లో చాలా రకాల వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఎక్కడైనా అమ్మ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఒక్కో దేశంలో అమ్మాయి ఒక్కోలా ఉండొచ్చు, కానీ.. ఏ దేశంలో అయినా అమ్మ ఒకేలా ఉంటుంది. అందుకే, అమ్మ ఎప్పుడూ అమ్మే.

Shilpa Shetty
Shilpa Shetty

అర్ధ నగ్న అందాలతో, శృంగార భరిత దృశ్యాలలో నటించే హీరోయిన్లలో కూడా అపురూప మైన అమ్మ ఉంటుంది. సినిమా హీరోయిన్ అనగానే సహజంగా చిన్నచూపు ఉంటుంది. కానీ, వాళ్లల్లోని అమ్మను తక్కువ చేయలేం. ఎంత హీరోయిన్ అయినా.. అమ్మ అమ్మే. ఈ విషయంలో శిల్పా శెట్టి నిదర్శనంగా నిలిచారు. అమ్మకు ఎప్పుడూ తన పిల్లలు పసి వాళ్లే. తాను లేకపోతే ఆ పిల్లలు వసివాళ్ల అయిపోతారని అమ్మకు తెలుసు. అందుకే, పిల్లల అడుగులను కూడా తానే అడుగై నడుస్తోంది.

Also Read: Shock To Tarak Fans: తారక్ ఫాన్స్ కి కోలుకోలేని షాక్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్

ఎయిర్ పోర్ట్ లో శిల్పా శెట్టి కూడా అచ్చం అలానే చేసి, అమ్మ తనానికి ప్రతిరూపంలా నిలిచారు. ఆమె నిన్న ముంబై ఎయిర్ పోర్ట్ కి తన కుమారుడు వియాన్, కూతురు సమీషాతో వచ్చారు. కూతురు సమీషా పై శిల్పా శెట్టి ఎంతో అపురూపమైన ప్రేమను చూపించారు. తన కూతురు కాలు నేల పై పెట్టకుండా చూసుకున్నారు. కష్టమైనా ఇష్టంగా కూతుర్ని ఎత్తుకుని, బయట ఉన్న కారు దాకా అలాగే నడుచుకుంటూ వెళ్లారు. అమ్మ అంటే ఆత్మీయ‌త‌, అమ్మ అంటే అనుబంధం అని శిల్పా శెట్టి ఈ విజువల్స్ తో నిరూపించారు. మరి శిల్పా శెట్టిలోని కమ్మని అమ్మను ఈ కింద వీడియోలో మీరు కూడా చూడండి.

Shilpa Shetty
Shilpa Shetty

అన్నట్టు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు శిల్పా శెట్టి దంపతులు. నీలి చిత్రాల ఆరోపణలపై శిల్పా భర్త రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నీలి చిత్రాల చిత్రీకరణ, యాప్ ల ద్వారా ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలు రాజ్ కుంద్రా ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఆయన రెండు నెలలు జైలులో ఉన్నారు. భర్త అరెస్ట్ తో శిల్పా అజ్ఞాతంలోకి వెళ్లారు. కొన్ని టీవీ కార్యక్రమాలకు ఆమె జడ్జిగా ఉండగా, వాటిలో పాల్గొనలేదు.

ఆ కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ఆమె బయటపడ్డారు. ఇక శిల్పా శెట్టి పిల్లల విషయానికి వస్తే.. కుమారుడు వియాన్ కు 8 సంవత్సరాలు. కూతురు సమీషాకు 3 ఏళ్ళు. సరోగసి ద్వారా ఆమెకు ఈ బిడ్డ పుట్టింది.

Also Read:Bigg Boss Nataraj Master: ఏకి పారేసిన నాగార్జున.. మోకాళ్లపై నిలబడి సారి చెప్పిన నటరాజ్ మాస్టర్..

Recommended Video:

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular