Homeఎంటర్టైన్మెంట్Karuppu 4 days worldwide collections: 'కరుప్పు' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 'వర్కింగ్...

Karuppu 4 days worldwide collections: ‘కరుప్పు’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘వర్కింగ్ డే’ లో కూడా ఈ రేంజ్ గ్రాస్ అసలు ఊహించలేదు..

Karuppu 4 days worldwide collections: ఈ ఏడాది మన టాలీవుడ్ లో అయినా ఆరంభం లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి కానీ , కోలీవుడ్ లో మాత్రం నిన్న మొన్నటి వరకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేక, థియేటర్స్ ని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయం లోనే ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన హీరో సూర్య ‘కరుప్పు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద […]

Karuppu 4 days worldwide collections: ఈ ఏడాది మన టాలీవుడ్ లో అయినా ఆరంభం లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి కానీ , కోలీవుడ్ లో మాత్రం నిన్న మొన్నటి వరకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేక, థియేటర్స్ ని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయం లోనే ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన హీరో సూర్య ‘కరుప్పు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. థియేటర్స్ కి ఆడియన్స్ ఒక జాతర ని చూసేందుకు ఎలా వెళ్తారో , అలా వెళ్తున్నారు. ఇలా సూర్య సినిమాలకు జనాలు కదిలి 14 ఏళ్ళు కావొస్తుంది. మొదటి వీకెండ్ లో అద్భుతమైన గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , మొదటి సోమవారం రోజున కూడా కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టింది.

తమిళనాడు లో అయితే మొదటి రోజు ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వచ్చిందో , దాదాపుగా అదే రేంజ్ గ్రాస్ నిన్న కూడా వచ్చింది. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 4 వ రోజున కేవలం తమిళనాడు ప్రాంతం నుండి 10 కోట్ల 92 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రజినీకాంత్, విజయ్ , అజిత్ వంటి వారికి కూడా వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు. దీనిని బట్టీ సూర్య ఏ రేంజ్ సూపర్ స్టార్ అనేది అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి 4 వ రోజున మొదటి రోజుతో సమానమైన వసూళ్లు వచ్చాయి. దాదాపుగా 2 కోట్ల 64 లక్షల రూపాయిలు 4 వ రోజున వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా కర్ణాటక లో ఈ చిత్రానికి 1 కోటి 60 లక్షలు రాగా , కేరళ నుండి 1 కోటి 34 లక్షలు వచ్చాయి.

కర్ణాటక , కేరళ వంటి రాష్ట్రాల్లో వర్కింగ్ డే లో ఈ రేంజ్ గ్రాస్ రావడం అంటే ఈ సినిమాని ఆడియన్స్ ఎంతలా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 4 వ రోజున 16 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. తమిళనాడు లో 4 రోజులకు 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి 4 వ రోజున 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఓవర్సీస్ లో నాలుగు రోజులకు కలిపి 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. ఓవరాల్ గా ఈ చిత్రానికి 142 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నాలుగు రోజుల్లో వచ్చాయి, షేర్ వసూళ్లు 67 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది , తమిళనాడు లో నేటితో బ్రేక్ ఈవెన్ అవ్వనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper