Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam 2: కార్తీక దీపం 2కి వంటలక్క రెమ్యూనరేషన్ తెలుసా? ఈ రేంజ్ లో...

Karthika Deepam 2: కార్తీక దీపం 2కి వంటలక్క రెమ్యూనరేషన్ తెలుసా? ఈ రేంజ్ లో వసూలు చేస్తుందా!

Karthika Deepam 2: తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర చేసిన ప్రేమీ విశ్వనాథ్ కి హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉంది. వంటలక్కగా ఆమె చాలా ఫేమస్. డీ గ్లామరస్ లుక్ లో .. ఒక సాధారణ మహిళ గా ప్రేమీ విశ్వనాథ్ కార్తీక దీపం సీరియల్ లో కనిపించింది. ఏళ్ల తరబడి సక్సెస్ ఫుల్ గా సాగిన కార్తీకదీపం వంటలక్క పాత్ర చుట్టే కథ నడుస్తుంది. తన సహజ నటనతో ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం సీరియల్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.

కాగా కార్తీక దీపం 2 ఇటీవల మొదలైంది. ‘కార్తీకదీపం 2 ఇది నవ వసంతం’లో కూడా ప్రేమి విశ్వనాథ్ లీడ్ రోల్ చేస్తుంది. పార్ట్ 1లో నటించిన నిరుపమ్ పరిటాల కూడా భాగమయ్యాడు. అయితే ప్రేమి విశ్వనాథ్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఆమె కార్తీకదీపం 2 కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒక్క రోజు షూట్ కి గానూ ఆమె రూ.35 వేల రూపాయలు తీసుకుంటున్నారట. ఇంత భారీ మొత్తంలో మరొక సీరియల్ నటి తీసుకోవడం లేదని సమాచారం.

కార్తీక దీపం 2 సీరియల్ కోసం నెలకు దాదాపు 20 రోజులు షూటింగ్ లో ప్రేమి విశ్వనాథ్ పాల్గొంటారు. ఆ లెక్కన ఆమె నెలకు రూ. 7 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదిస్తుందని టీవీ ట్రేడ్ వర్గాల వెల్లడించారు. కాగా ప్రేమి విశ్వనాథ్ ఇప్పటి వరకు 6 సీరియల్స్ లో నటించారు. కురువ మత్తు అనే మలయాళీ సీరియల్ తో నటిగా మారింది. ఆ తర్వాత కుట్టికలవరా, మౌనంమణి, కాయంకులనం కోచీనున్నాయుడే మకన్, కార్తీకదీపం, కార్తీకదీపం 2 లో నటించింది.

ఆమె మలయాళంలో నటించిన కరువ ముత్తు సీరియల్ నే తెలుగులో కార్తీకదీపం గా రీమేక్ చేశారు. పేమి విశ్వనాథ్ సినిమాల్లో కూడా నటించింది. నాగ చైతన్య కస్టడీ మూవీలో ప్రేమీ విశ్వనాథ్ నటించింది. ప్రస్తుతం సౌత్ టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సీరియల్ నటిగా ప్రేమి విశ్వనాథ్ నిలిచారు. కార్తీకదీపం సీరియల్ తో ఆమె రేంజ్ మారిపోయింది.

RELATED ARTICLES

Most Popular