Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ బాబు, వంటలక్క అంటే ఒక బ్రాండ్ లాగా మారిపోయారు. దాదాపు ఆరేళ్ల పాటు బుల్లితెర పై నంబర్ వన్ సీరియల్ గా హవా సాగించింది. దీనికి ఇప్పుడు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. కార్తీకదీపం పార్ట్ 2 కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదల చేశారు. నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ మళ్లీ జంటగా నటిస్తున్నారు. వారితో పాటు సౌర్య పాప ని ప్రోమోలో చూపించారు. డాక్టర్ బాబు, వంటలక్క సందడి మళ్లీ మొదలవనుంది.
దీంతో ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు. డాక్టర్ బాబు, వంటలక్క తో పాటు మోనిత కూడా సీరియల్ సక్సస్ లో కీలక పాత్ర పోషించింది. విలన్ పాత్రలో అద్భుతంగా నటించింది. లేడీ విలన్ గా క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు సీక్వెల్ లో మోనిత క్యారెక్టర్ ఉంటుందా లేదా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ శోభా శెట్టి స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తాను కార్తీకదీపం 2 లో నటించడం లేదని శోభా చెప్పింది.
కార్తీకదీపం ప్రోమో వచ్చినప్పటి నుంచి చాలా మంది ఆమెను అడుగుతున్నారని తెలిపింది. తనకు సీరియల్ నుంచి ఎటువంటి కాల్ రాలేదని, నాకు కూడా కార్తీకదీపం సీరియల్ అంటే చాలా ఇష్టం అని శోభా చెప్పింది. కార్తీకదీపం మోనిత క్యారెక్టర్ తన జీవితాన్నే మార్చేసిందని తెలిపింది. నా లైఫ్ లో ఇదే బెస్ట్. మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ వస్తుందో లేదో తెలియదు అని శోభ శెట్టి వెల్లడించింది. ప్రస్తుతానికి కార్తీక దీపం 2 నేను చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది శోభా శెట్టి.
బిగ్ బాస్ తర్వాత శోభా శెట్టి యాక్టింగ్ వైపు మొగ్గు చూపడం లేదు. తనను కార్తీక దీపం లో విలన్ గా చూసి .. బిగ్ బాస్ లో కూడా విలన్ గానే చూశారు అంటూ శోభా చెప్పుకొచ్చింది. నిజానికి శోభా శెట్టి రియల్ క్యారెక్టర్, బిహేవియర్ చూసి మోనిత నే బెటర్ అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అంత వరస్ట్ గా శోభా శెట్టి ప్రవర్తన ఉంది. చిల్లర గేమ్స్ ఆడుతూ, నోటికొచ్చింది మాట్లాడుతూ చిరాకు తెప్పించింది. ఇక సీరియల్స్ లో అవకాశాలు లేకపోవడంతో కొత్తగా బిజినెస్ పై ఫోకస్ పెట్టింది. మరో వైపు హోస్ట్ గా కాఫీ విత్ శోభా పేరుతో ఒక టాక్ షో చేస్తుంది.
Web Title: Lady villain shobha shettys re entry into karthika deepam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com