spot_img
Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam: మొత్తానికి సౌందర్య, ఆనందరావులను చూసిన కార్తీక్, దీప!

Karthika Deepam: మొత్తానికి సౌందర్య, ఆనందరావులను చూసిన కార్తీక్, దీప!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం.. ఇక దీప రుద్రాణి అన్న మాటలను తలుచుకొని పిల్లల గురించి ఆలోచిస్తుంది. అంతలోనే బాబు ఏడవటంతో బాబుకు పాలు పట్టిస్తుంది. గ్యాస్ అయిపోవటంతో అప్పారావుని అడగాలని అనుకుంటుంది. హోటల్ లో అప్పు కార్తీక్ కు రెండు పార్సల్స్ ఇచ్చి ఒకటి ప్రకృతి వైద్యశాల కి, మరొకటి రుద్రాణికి ఇవ్వమంటాడు. ఇక అప్పు రుద్రాణి గురించి చెప్పి కార్తీక్ కు జాగ్రత్తగా ఉండమని చెబుతాడు.

అంతలోనే దీప అక్కడికి రావడంతో కార్తీక్ వెళ్ళిపోతాడు. అప్పు దగ్గరికి వెళ్లి గ్యాస్ అడగటంతో ఇంతకు ముందే మా బావకు మాటిచ్చానని అంటాడు అప్పు. మోనిత విన్నీతో తన లవ్ గురించి చెప్పడంతో విన్నీ తనను బాగా పొగుడుతుంది. ఇక కార్తీక్ ప్రకృతి వైద్యశాలకు వెళ్లగా అక్కడ గదిలో ఆనందరావు ని చూసి కార్తిక్ షాక్ అవుతాడు. తన వల్లే ఇదంతా జరిగిందని బాధపడతాడు.

అప్పుడే సౌందర్య రావటంతో డోర్ వెనకాల దాచుకొని వాళ్ళ మాటలని వింటూ బాధపడుతూ ఉంటాడు. సౌందర్య ఆనందరావుని భోజనం చేయమని అనటంతో ఆనందరావు తనకు ఆకలిగా లేదని అంటూ పెద్దోడు గుర్తుకు వస్తున్నాడు అంటూ ఎమోషనల్ అవుతాడు. అన్నం తింటున్నప్పుడల్లా కొడుకు తింటున్నాడా లేడా అని మనుమరాలు, దీప తిన్నారా లేదా అని అనిపిస్తుంది అంటూ బాధపడుతాడు. ఇక వాళ్ళని తలుచుకొని ఆనందరావు బాగా ఏడుస్తూ ఉంటాడు.

ఇక సౌందర్య ఓదార్చుతూ ఉంటుంది. మరో వైపు రుద్రాణి మనుషులు పిల్లలకు భోజనం తినిపించాలని స్కూల్ కి వెళ్తారు. ఇక పిల్లలు భోజనం చేస్తామని చెప్పి అక్కడున్న పిల్లలకు వడ్డిస్తారు. వెంటనే రుద్రాణి మనుషులు అదంతా చూసి హిమ వాళ్ల గురించి వెతుకుతారు. కానీ పిల్లలు వాళ్ల నుంచి తప్పించుకొని వస్తారు. ఇంట్లో దీపకు స్కూల్లో జరిగిన సంఘటన చెబుతారు. ఇక దీప మళ్లీ ఆలోచనలో పడుతుంది. తరువాయి భాగం లో దీప.. సౌందర్య, ఆనందరావు వాళ్లను చూసి షాక్ అవుతూ ఏడుస్తుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper