Homeఎంటర్టైన్మెంట్Malavika Mohanan: నన్ను టాలీవుడ్ కి రాకుండా ఆపింది విజయ్ దేవరకొండ నే అంటూ 'రాజా...

Malavika Mohanan: నన్ను టాలీవుడ్ కి రాకుండా ఆపింది విజయ్ దేవరకొండ నే అంటూ ‘రాజా సాబ్’ హీరోయిన్ హాట్ కామెంట్స్!

Malavika Mohanan: తమిళం, మలయాళం ఇండస్ట్రీస్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హాట్ హీరోయిన్స్ లో ఒకరు మాళవిక మోహనన్(Malavika Mohanan). ఈమె తండ్రి KU మోహనన్ ఒక పాపులర్ సినిమాటోగ్రాఫర్. తెలుగు లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసాడు. ఆయన కుమార్తెగా మలయాళం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మాళవిక మోహనన్, అతి తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. మలయాళం లో పాపులర్ అయిన తర్వాత ఈమెకు తమిళం లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక్కడ కూడా సక్సెస్ అవ్వడం తో ఆమెకు టాలీవుడ్ లో కూడా చాలా అవకాశాలే వచ్చాయి. ఎప్పుడో మన టాలీవుడ్ కి పరిచయం అవ్వాల్సిన ఈ హాట్ బ్యూటీ , ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం తో మన ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుంది.

Also Read: ఆరోజు నేనలా మాట్లాడటానికి కారణం అదే… అనసూయ క్షమాపణ.. వైరల్…

ఈమె తెలుగు లో ఒక్క సినిమా చేయకపోయినా, మన టాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో కూడా ఈమెకు మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది. ఈమె ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేవారు యూత్ ఆడియన్స్. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో, రిపోర్టర్ ఈమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఎందుకు మీరు టాలీవుడ్ లో సినిమా చేయడానికి ఇన్ని రోజుల సమయం తీసుకున్నారు?’ అని అడగ్గా, దానికి మాళవిక సమాధానం చెప్తూ ‘వాస్తవానికి నేను నాలుగేళ్ల క్రితమే టాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. మా ప్రాజెక్ట్ ఖరారు అయ్యాక ఏమైందో ఏమో తెలియదు కానీ, విజయ్ గారు ఆ ప్రాజెక్ట్ ని రద్దు చేసి లైగర్ చిత్రం చేసాడు. అలా నా టాలీవుడ్ డెబ్యూ మూవీ నాలుగేళ్ల క్రితం ఆగిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్.

Also Read: మహేష్ బాబును టార్చర్ పెట్టిన దర్శకులు వీళ్లేనా..?

అయితే ఆలస్యం అయినప్పటికీ కూడా మంచి ప్రాజెక్ట్ తోనే ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ రోల్ అంటే ఆశా మాషి విషయం కాదు కదా. ఈ సినిమా హిట్ అయితే ఆమె పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే. ఈ చిత్రం లో మాళవిక మోహనన్ తో పాటు, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా నటించారు. ‘రాజాసాబ్’ ప్రొమోషన్స్ లో ఎక్కడ చూసినా ఈ ముగ్గురు హీరోయిన్స్ మాత్రమే కనిపిస్తున్నారు. హీరో ప్రభాస్ ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు , అదే విధంగా డైరెక్టర్ మారుతీ కూడా ప్రొమోషన్స్ లో పెద్దగా పాల్గొనడం లేదు. సినిమా ప్రొమోషన్స్ మొత్తం బాధ్యత ఈ ముగ్గురు హీరోయిన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ దేవరకొండ తో మొదలు పెట్టిన మూవీ కి సంబంధించి అప్పట్లో ముహూర్తం షాట్ వీడియో ని మీకోసం ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular