Kangana Ranaut: కంగనా రనౌత్ నోరు తెరిస్తే బూతు సువాసనలు వస్తుంటాయని ఆమె బాధితులు నిత్యం తలా బాదుకుంటూ వెల్లడిస్తూ ఉంటారు. అసలు కంగనా అంటేనే వివాదం.. ఎప్పుడు ఆమె చుట్టూ వంద వివాదాలు కాలక్షేపం చేస్తూ ఉంటాయి. అయితే, ఈ మధ్య ఈ బూతుల మహారాణి మాట్లాడుతూ ‘1947లో దేశానికి వచ్చింది నిజమైన స్వాతంత్య్రం కాదని, అది భిక్ష మాత్రమే అని, దేశానికీ నిజమైన స్వాతంత్య్రం వచ్చింది 2014లో’ అంటూ మోదీని పొగుడుతూ కామెంట్స్ చేసింది.

ఇక కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది అంటూ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమైపోయి.. ఆమె పై విరుచుకుపడటానికి సోషల్ మీడియా వేదిక పై యుద్దాన్ని ప్రకటించాయి. ఇలాంటి యుద్ధాలను చూసి చూసి అలసి సొలసి పోయిన కంగనా మాత్రం ఈ యుద్దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటిలాగే తనదైన శైలిలో ఓ హాట్ ఫోటో షూట్ కి రెడీ అయింది.
మరోపక్క కంగనా యాంటీ బ్యాచ్ మొత్తం ఆమెను ఒక దేశ ద్రోహిగా చిత్రీకరించడానికి నానాపాట్లు పడుతుంది. అయితే, ఈ దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు పోరాడి, తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. అలాంటి త్యాగ మూర్తుల పోరాటాన్ని, ఫలితాన్ని కంగనా నిజమైన స్వాతంత్య్రం కాదు అంటూ అవమానకరంగా మాట్లాడటం కచ్చితంగా తప్పే.
అయినా అలా మాట్లాడటం లోనే ఆమె జీవిత ప్రయాణం సాగుతుందని తెలిసిందే కదా. మరి అలాంటి ఆమె గురించి, ఆమె వ్యాఖ్యలు గురించి పట్టించుకోవడం దేనికి ? మరోపక్క కంగనాని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అసలు ఆమె కంటే ఎందరో గొప్ప నటీమణులు ఉన్నారు. మరెందరో సేవా మూర్తులు ఉన్నారు.
Also Read: Sara Alikhan: మాల్దీవ్స్ బీచ్ లో మల్టీ-కలర్ కార్టూన్ ప్రింట్ బికినీలో బీ టౌన్ బ్యూటీ
అయినా కంగనాకు మాత్రమే ఎందుకు పద్మశ్రీ వచ్చింది అంటేనే.. అర్ధం అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఆమె పట్ల ప్రత్యేక ప్రేమను చూపిస్తోందని. అందుకే, కంగనా కూడా మోదీని పొగడటానికి మహనీయులను అవమానిస్తూ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూస్తోంది. ఏది ఏమైనా కంగనా లాంటి దిగువస్థాయి నటి నుంచి పద్మశ్రీ జారిపోవడమే ఉత్తమం.
Also Read: Bigg Boss 5 Telugu: వరల్డ్ వైడ్ ట్విట్టర్ ట్రెండ్ లో మిస్టర్ కూల్