Tamannaah: తమన్నా.. వయసు అయిపోతున్నా అవకాశాల కోసం అర్రులు చాస్తోన్న ముదురు హీరోయిన్. ఒకపక్క తనతో వచ్చిన హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కంటూ ఉంటే.. తమన్నా మాత్రం రెమ్యునరేషన్ కోసం ఇంకా ప్రాకులాడుతుంది. డబ్బులు ఇస్తే ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తాను అంటూ ఒక పీఆర్వో టీమ్ ను కూడా పెట్టుకుంది. మొత్తానికి ఈ పీఆర్వో టీమ్ పుణ్యమా అని మిల్క్ బ్యూటీకి ఐటమ్ సాంగ్ లు కాదు, ఏకంగా హీరోయిన్ ఛాన్స్ లు వస్తున్నాయి.

అది కూడా మెగాస్టార్ లాంటి హీరో పక్కన. నిజానికి భోళా శంకర్ సినిమాలో మొదట అనుష్కను హీరోయిన్ గా అనుకున్నారు. ఎందుకో కుదరలేదు. ఆ తర్వాత కాజల్ ను అనుకున్నారు. అయితే, ఇంతలో కాజల్ కడుపు తెచ్చుకుని ఇంట్లో కూర్చుంది. ఇక గోవా ముదురు భామ ఇలియానా పేరు కూడా చర్చలోకి వచ్చింది. ఇలియానా షేప్ అవుట్ అయిపోయిందని ఆమెకు అవకాశం ఇవ్వలేదు.
ఇక రేసులో ఉన్న హీరోయిన్స్ లో తమన్నా బెటర్ ఆప్షన్ అనిపించింది. పైగా సైరాలో కూడా తమన్నా చిరుతో కలిసి నటించింది. అందుకే, భోళా శంకర్ కోసం చిరుతో జత కట్టడానికి తమన్నానే బెటర్ అని మేకర్స్ ఫీల్ అయ్యారు. చివరకు తమన్నా భోళా శంకర్ హీరోయిన్ అయింది. అయితే, ఈ సినిమాకి భారీ హోప్ వచ్చింది.
కాబట్టి.. తమన్నాకు ఈ సినిమా మరో నాలుగేళ్ళ లైఫ్ ను ఇస్తోందని అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ ఏడాది సినిమాలకు కొంత బ్రేక్ తీసుకుని ఏదైనా వెకేషన్ కి వెళ్ళాలి అని తమన్నా ప్లాన్ చేసుకుంది. కానీ మెగాస్టార్ సరసన అవకాశం వచ్చింది. అలాంటి పెద్ద ఛాన్స్ వచ్చినప్పుడు.. ఎంత అలసిపోయినా పనిచేయాలనిపిస్తుంది’ అంటూ తమన్నా సిగ్గు పడుతూ చెప్పుకొచ్చింది.
Also Read: KBR Park: కేబీఆర్ పార్క్ లో టాలీవుడ్ హీరోయిన్ పై దాడి.. షాకింగ్ ఘటన
అన్నట్టు ఈ భోళా శంకర్ తో తన బెస్ట్ ను చూపిస్తుందట. బెస్ట్ అంటే నటన మాత్రమే కాదు, లుక్స్ పరంగా, అందాల ప్రదర్శన పరంగా మొత్తానికి ఓ కొత్త తమన్నాని చూస్తారు అంటూ తమన్నా తెగ చెబుతుంది. మరి తమన్నా ఈ సినిమా కోసం ఏమైనా ప్రత్యేక సర్జరీలు చేయించుకుంటుందేమో చూడాలి.
Also Read: పిచ్చి కూతలు కూస్తోంది, పద్మశ్రీ జారిపోవడమే ఉత్తమం !