spot_img
Homeఎంటర్టైన్మెంట్Acharya Movie: "కల్లోలం" అంటూ స్టెప్పులతో దుమ్ము రేపుతోన్న చిరు... అందాల ఆరబోతలో రెజీనా ఫుల్...

Acharya Movie: “కల్లోలం” అంటూ స్టెప్పులతో దుమ్ము రేపుతోన్న చిరు… అందాల ఆరబోతలో రెజీనా ఫుల్ ట్రీట్ !

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. చిరు చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే వినాయక్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక మెగాస్టార్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్‌ లుక్‌, పాటలు ఈ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

kallolam song release from megastar chiranjeevi acharya movie

హీరోయిన్ రెజీనా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ సాగే ఈ పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ మేరకు తాజాగా ఈ ఫుల్ సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ముఖ్యంగా చిరంజీవి ఈ పాటకు వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. డ్యాన్స్‌లకు పెట్టింది పేరైనా చిరు… ఎన్నేళ్లు అయినా తనలోని స్టామినా ఏ మాత్రం తగ్గలేదన్నట్లు స్టెప్స్‌తో రచ్చ రచ్చ చేశారు.

రెజీనాతో పోటీపడీ మరీ కాలు కదిపారు. మరో వైపు రెజీనా కూడా తన అందాలతో కుర్రకారుని ఫిదా చేస్తుంది. ఈ పాటను భాస్కరభట్ల రచించగా.. రేవంత్‌, గీతా మాధురి పాడారు. ఇక సంగీతం దిగ్గజం మణిశర్మ అందించిన ట్యూన్స్‌ ఈ పాటకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఆచార్యతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి చిరు గట్టిగా ప్లాన్ ఛేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper