Homeఎంటర్టైన్మెంట్Devara Part-1 Glimpse: దేవర ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: ఎన్టీఆర్ ఊచకోత, సముద్రం రక్తంతో ఎరుపెక్కింది!

Devara Part-1 Glimpse: దేవర ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: ఎన్టీఆర్ ఊచకోత, సముద్రం రక్తంతో ఎరుపెక్కింది!

దేవర టీజర్ లో కూడా సముద్రమే హైలెట్. డార్క్ థీమ్ లో ఉన్న విజువల్స్ అద్భుతం చేశాయి. చిన్న పడవల్లో వెళ్లి నౌకల్లో దోపిడీ చేయడం చూపించారు. అనంతరం సాగర తీరంలో ఓ భారీ ఫైట్.

Devara Part-1 Glimpse: ఎన్టీఆర్-కొరటాల కాంబోలో రెండో చిత్రంగా వస్తుంది దేవర. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రూ . 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. నేడు దేవర మూవీ అప్డేట్ వచ్చింది. మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. నిమిషానికి పైగా నిడివి ఉన్న దేవర అంచనాలకు మించి ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దేవర సాగర తీరం ప్రధానంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ అదే కోణంలో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

దేవర టీజర్ లో కూడా సముద్రమే హైలెట్. డార్క్ థీమ్ లో ఉన్న విజువల్స్ అద్భుతం చేశాయి. చిన్న పడవల్లో వెళ్లి నౌకల్లో దోపిడీ చేయడం చూపించారు. అనంతరం సాగర తీరంలో ఓ భారీ ఫైట్. ఎన్టీఆర్ నల్ల చొక్కా, పంచె కట్టులో విలన్స్ ని ఊచ కోత కోస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ డైలాగ్ ఫెరోషియస్ గా ఉంది. ఈ సముద్రం చేపలకంటే కత్తులను నెత్తురును ఎక్కువగా చూసింది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు, అనే డైలాగ్ గూస్ బంప్స్ కలిగించింది.

టీజర్ లో బీజీఎం మెప్పించింది. మొత్తంగా దేవర ఫస్ట్ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. ఎన్టీఆర్ మాస్ ఇంటెన్స్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలెట్ కానుందని చెప్పొచ్చు. ఆచార్య విఫలం కావడంతో దర్శకుడు కొరటాల శివ విమర్శల పాలయ్యాడు. ఆ చిత్ర హీరో చిరంజీవి పలుమార్లు పరోక్షంగా తన అసహనం బయటపెట్టారు. అందుకే కొరటాల దేవర చిత్రాన్ని కసితో తెరకెక్కిస్తున్నాడు.

దేవర చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేదు. మరో ఎన్టీఆర్ కి జంటగా ప్రియమణి నటిస్తుందట. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper