Homeఎంటర్టైన్మెంట్Jr NTR: ఎన్టీఆర్ కి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్ సురేష్ ఒక్కడేనా.?...

Jr NTR: ఎన్టీఆర్ కి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్ సురేష్ ఒక్కడేనా.? ఇంతకీ సురేష్ ఎవరు..?

Jr NTR: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తూ ఉంటారు. వివి వినాయక్ దర్శకత్వంలో చేసిన ‘ఆది’ సినిమాతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన సింహాద్రి సినిమాతో బీ,సీ సెంటర్ లోని ఆడియన్స్ అందరిని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నారు. అలాంటి […]

Jr NTR: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తూ ఉంటారు. వివి వినాయక్ దర్శకత్వంలో చేసిన ‘ఆది’ సినిమాతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన సింహాద్రి సినిమాతో బీ,సీ సెంటర్ లోని ఆడియన్స్ అందరిని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఏదో ఒక కారణం చేత ఆయన సినిమాలు ఆశించిన మేరకు విజయాలనైతే సాధించలేకపోతున్నాయి. ఇక తన తోటి హీరోలు ఇండస్ట్రీ హిట్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సక్సెస్ లను సాధిస్తున్న కూడా ఒక మోస్తరు సక్సెస్ గానే మారుతున్నాయి తప్ప ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇలా మారుతున్నాయి ఆయన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు అన్నింటి విషయంలోనూ తను స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. నటనపరంగా కూడా ఆయన చాలావరకు మెలకువలను పాటిస్తూ ప్రతి క్యారెక్టర్ కి వేరియేషన్స్ ను చూపిస్తున్నాడు.

అయిన కూడా ఆయన టాప్ హీరోగా మారలేకపోతున్నాడు. నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవాలి అంటే వరుస సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ లను సాధించే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ కి చిన్నప్పటి నుంచి కూడా చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవారట.

స్కూల్లో పరిచయమైన స్నేహితులతోనే తను ఎక్కువగా గడిపేవాడని చెబుతుంటారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో రాజీవ్ కనకాలతో తను చాలా బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఇప్పటికి వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఇండస్ట్రీకి రాక ముందు నుంచి కూడా అతనికి సురేష్ అనే ఒక ఫ్రెండ్ అయితే ఉండేవాడట. చిన్నతనంలో తన స్కూల్ మెట్ కావడం వల్ల అతనితో తన విషయాలని షేర్ చేసుకునేవాడు.

కాలేజీలో చదువుకున్న రోజుల్లో కూడా అతను తన పక్కనే ఉండేవాడట. సురేష్ ఎప్పుడు ఫోటోలు దిగడానికి వీడియోల్లో కనిపించడానికి పెద్దగా ఇష్టపడడు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన బిజినెస్ పనులను చూసుకుంటూ ఉండటం, ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనడం వల్ల వీళ్ళిద్దరికి ఎక్కువగా కలుసుకునే అవకాశామైతే రావడం లేదంటూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ ఒక ఈవెంట్లో చెప్పడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper