Homeఎంటర్టైన్మెంట్Jeevitha Rajasekhar response on Gotila factory: హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ పై మొదటి...

Jeevitha Rajasekhar response on Gotila factory: హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ పై మొదటి సారి స్పందించిన జీవిత!

Jeevitha Rajasekhar response on Gotila factory: ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ తరం ప్రేక్షకులకు పెద్ద పరిచయం లేకపోయుండొచ్చు, కానీ ఆయన గోటీల వ్యాపారం ద్వారా మాత్రం ఈ తరం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించి మీమ్స్ ఒక రేంజ్ లో కనిపిస్తుండేవి. ఆడియన్స్ వాటిని చూసి పగలబడి నవ్వుకునేవారు. కొంతమంది ఇది ఫన్నీ మీమ్స్ అని తెలియని వాళ్ళు, రాజశేఖర్ కి నిజంగా గోటీల […]

Jeevitha Rajasekhar response on Gotila factory: ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ తరం ప్రేక్షకులకు పెద్ద పరిచయం లేకపోయుండొచ్చు, కానీ ఆయన గోటీల వ్యాపారం ద్వారా మాత్రం ఈ తరం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించి మీమ్స్ ఒక రేంజ్ లో కనిపిస్తుండేవి. ఆడియన్స్ వాటిని చూసి పగలబడి నవ్వుకునేవారు. కొంతమంది ఇది ఫన్నీ మీమ్స్ అని తెలియని వాళ్ళు, రాజశేఖర్ కి నిజంగా గోటీల వ్యాపారం ఉందా ?, అందులో పని చేసేవారికి లక్షల్లో జీతాలు ఇస్తున్నారా ?, ఇదేంటి బాబోయ్ , అసలు దీని విషయం తేల్చాల్సిందే అంటూ గూగుల్ లో దీని గురించి వెతకడం వంటివి కూడా చేశారు. అయితే ఈ గోటీల వ్యాపారం న్యూస్ పై రాజశేఖర్ సతీమణి జీవిత మొట్టమొదటిసారి స్పందించింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ ‘అసలు ఈ గోటీల వ్యాపారం ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు. ఎవరు , ఎలా ఈ వార్తని పుట్టించారో , అది సోషల్ మీడియా లో ఇంత వైరల్ అయ్యిందో తెలియడం లేదు. కానీ వార్తకు సంబంధించిన మీమ్స్ చూసి నేను, మా ఆయన , పిల్లలు బాగా నవ్వుకున్నాం. అయితే మా ఆయనకు గోటీల వ్యాపారం ఉందని, అందులో పని చేస్తున్న వారికి లక్షల్లో జీతం ఇస్తున్నారని సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ఫేక్ ప్రచారం వల్ల మాకు ఎలాంటి నష్టం జరగలేదు కానీ, కొంతమంది ఈ ఫ్యాక్టరీ లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు దోచుకున్నారట. ఈ విషాయం నా దృష్టుకి రావడంతో చాలా బాధపడ్డాను. అలా చేయడం చాలా తప్పు, దయచేసి అలా చేయకండి ‘ అంటూ ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Also Read: సుడిగాలి సుధీర్ రాబోయే రోజుల్లో మరో శివ కార్తికేయన్ కాబోతున్నాడా? ప్లానింగ్ చూస్తే అలాగే ఉంది!

అలా ఈ గోటీల వ్యాపారం వార్తకు జీవిత ఇలా తెరదించింది. ఇక రాజశేఖర్ సినిమాల విషయానికి వస్తే, హీరో గా ఆయన కెరీర్ ముగిసిపోయింది. దీంతో ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన శర్వానంద్ ‘బైకర్ ‘ మూవీ లో కీలక పాత్ర పొసగిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాలోని ఆయనకు సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అదే విధంగా ఆయన విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన ‘ చిత్రం లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper