East Bengal vs al – Shorta: మనదేశంలో క్రికెట్ మాత్రమే కాదు.. ఫుట్ బాల్ కూడా విపరీతంగా ఆడుతుంటారు. ఇలా ఆడే రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఫుట్ బాల్ క్లబ్బులు ఉన్నాయి. ఫిఫా కప్ జరుగుతుంటే మాత్రం ఇక్కడ ప్రతిరోజు సందడే సందడి. ఇక్కడ ఉన్న సాల్ట్ లేక్ స్టేడియంలో అప్పుడప్పుడు ఫుట్ బాల్ మ్యాచ్ లు జరుగుతుంటాయి. వాటిని వీక్షించేందుకు అభిమానులు భారీగా వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈస్ట్ బెంగాల్ వర్సెస్ ఆల్ షార్టా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఈ స్టోరీ రాసే సమయం వరకు రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. రెండు జట్లు చెరొక గోల్ సాధించాయి.. ఈస్ట్ బెంగాల్ తరఫున డేవిడ్ తొలిగోల్ చేశాడు. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని అతడు ఛేదించి తొలి గోల్ చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ గోల్ తో బెంగాల్ తన సత్తా చాటింది. అయితే ఆల్ షార్టా కూడా గట్టిగానే పోటీ ఇస్తోంది. దీంతో మ్యాచ్ అత్యంత ఉత్కంఠ గా మారింది.
2026 -27 ఏఎఫ్ సీ ఛాంపియన్స్ లీగ్ 2 గ్రూప్ డీ లో ఉన్న ఈస్ట్ బెంగాల్ ఆడుతున్న అత్యంత కీలకమైన మ్యాచులలో ఇది ఒకటి. సెప్టెంబర్ లో జరిగిన తొలి గ్రూప్ మ్యాచ్లో జోర్డాన్ కు చెందిన అల్ హుస్సేన్ జట్టుతో ఈస్ట్ బెంగాల్ 2-2 తో డ్రా చేసుకుంది. మరోవైపు అల్ షార్టా తన తొలి మ్యాచ్లో అల్ సీబ్ పై 1-0 తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో పాయింట్లు సాధించడం ఈస్ట్ బెంగాల్ జట్టుకు అత్యంత కీలకం. సొంత మైదానంలో అభిమానుల సపోర్టుతో బల్లోకి దిగిన జట్టు… ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తోంది. స్కోరు 1-1 తో సమానంగా ఉన్న నేపథ్యంలో రెండు జట్లకు మరో గోల్ సాధించడానికి అవకాశం ఉంది. ఈస్ట్ బెంగాల్ విజయం కోసం ప్రయత్నిస్తుండగా.. ప్రత్యధి జట్టు కూడా ఆధిపత్యం సాధించడానికి పోటీపడుతోంది.
సాల్ట్ లేక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు భారీగా వచ్చారు. పైగా వెస్ట్ బెంగాల్ జట్టు ప్లేయర్లు ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి ఆట తీరు చూసేందుకు ప్రేక్షకులు భారీగా రావడంతో మైదానం మొత్తం కిటకిటలాడుతోంది. సాల్ట్ లేక్ మైదానంలో ఈ స్థాయిలో ప్రేక్షకులు రావడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు. సొంత ప్రేక్షకుల సపోర్టు ఉన్న నేపథ్యంలో మైదానంలో వెస్ట్ బెంగాల్ ప్లేయర్లు ఉత్సాహంగా ఆడుతున్నారు.