Homeఎంటర్టైన్మెంట్Jabardasth Chanti: "నా పొట్ట కొట్టారు.. వాడి నాశనం చూశాకే చస్తా!".. జబర్దస్త్ చంటి సంచలన...

Jabardasth Chanti: “నా పొట్ట కొట్టారు.. వాడి నాశనం చూశాకే చస్తా!”.. జబర్దస్త్ చంటి సంచలన వ్యాఖ్యలు

Jabardasth Chanti: సినిమా ఇండస్ట్రీని బయట నుంచి చూసేవారికి రంగుల ప్రపంచం లాగా కనిపిస్తుంది. కానీ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు విషయాలు బయట పడతాయి. ఎంతో మంది నటులు ఎన్నో ఆశలతో ఇందులోకి అడుగుపెట్టారు. కానీ ఇక్కడ అనుకున్న దానికంటే పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయంటూ ఆవేదన చెందుతూ.. ఇందులో నుంచి బయటపడలేక.. మనసును చంపుకొని ఉండలేక.. నానా తిప్పలు పడ్డారు. అలా ఓ నటుడు తనకు ఓ లక్షణం లేకపోవడం వల్ల తన […]

Jabardasth Chanti: సినిమా ఇండస్ట్రీని బయట నుంచి చూసేవారికి రంగుల ప్రపంచం లాగా కనిపిస్తుంది. కానీ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు విషయాలు బయట పడతాయి. ఎంతో మంది నటులు ఎన్నో ఆశలతో ఇందులోకి అడుగుపెట్టారు. కానీ ఇక్కడ అనుకున్న దానికంటే పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయంటూ ఆవేదన చెందుతూ.. ఇందులో నుంచి బయటపడలేక.. మనసును చంపుకొని ఉండలేక.. నానా తిప్పలు పడ్డారు. అలా ఓ నటుడు తనకు ఓ లక్షణం లేకపోవడం వల్ల తన కెరీర్ నాశనం అయిందని.. ఇప్పుడు ఆ లక్షణం తోనే ఇండస్ట్రీలో కొందరు రాణిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పటికైనా నా పొట్ట కొట్టిన వారిని విడిచి పెట్టేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు చలాకి చంటి.. ఇంతకీ ఆయనకు జరిగిన నష్టం ఏమిటంటే?

ఓవైపు బుల్లితెరపై.. మరోవైపు వెండితెరపై తన నటనతో ఆకట్టుకున్న చలాకీ చంటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో ఈయన స్కిట్లకు ఫ్యాన్స్ అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. పైకి నవ్వులు పూజించే చలాకి చంటి లోలోపల మాత్రం ఎంతో వేదన పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. కొన్ని సందర్భాల్లో తాను పడిన అవమానాలు.. చేసిన పొరపాట్ల వాళ్లే తన కెరీర్ నాశనం అయిందని అంటున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో ఇగో లక్షణం చాలా ముఖ్యం అని చలాకి చంటి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ సందర్భంలో నేను ఓ డైరెక్టర్ ను పేరు పెట్టి పిలవడం ద్వారా అతనికి ఎలాంటి బాధ కలిగించకపోయినా.. మిగతావారు మాత్రం ఓర్వలేక పోయారని అన్నాడు. దీంతో తనకు ఓ మంచి సినిమాలో వచ్చే అవకాశం చేజారిపోయిందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో భజన పరులకు పెద్దపీట ఉంటుందని.. ఈ లక్షణం లేని వారిని తొక్కేస్తారని చెప్పుకొచ్చాడు. భజనపరులు ఎన్ని తప్పులు చేసినా కొందరు వెనుకేసుకొస్తారని.. అదే ఈ లక్షణం లేని వారు ఎలాంటి తప్పులు లేకపోయినా.. చిన్న చిన్న తప్పులు చేస్తే వాటిని పెద్దగా చూపించి దూరం పెడతారని అన్నారు.

ఈ నేపథ్యంలో తాను చేసిన ఓ చిన్న పొరపాటు కు పెద్ద శిక్ష పడిందని అన్నారు. ఓసారి ఓ డైరెక్టర్ తండ్రి పక్కన సిగరెట్ కాలుస్తూ కనిపించాలని.. ఆ విషయం ను ఆసరాగా తీసుకొని కొందరు రాద్ధాంతం చేసి.. తనకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇండస్ట్రీలో తన విషయంలో ఎంతో మంది అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని.. అంతేకాకుండా తనకు ఇగో ఎక్కువ అంటూ ప్రచారం చేశారని అన్నారు. అలా చేయడం వల్లే ఎన్నో అవకాశాలు దూరమయ్యాయి అని చెప్పారు. ప్రతి నటుడు డైరెక్టర్ చెప్పినట్టే నడుచుకుంటాడని.. అయితే దీనిని అవకాశంగా తీసుకొని కొందరు మరింత కష్టపెడతారని చలాకి చంటి చెప్పుకొచ్చారు..

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper