Chalaki Chanti: జబర్దస్త్ కామెడీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కమెడియన్స్ లో ఒకరు చలాకి చంటి. ఒకప్పుడు ప్రతీ టీవీ షో లో కనిపిస్తూ వచ్చిన ఈయన, ఈమధ్య కాలం లో పెద్దగా కనిపించడం లేదు. జబర్దస్త్ షోలో మంచి గుర్తింపు ని సంపాదించుకున్న తర్వాత సినిమాల్లో చలాకి చంటి కి అవకాశాలు బాగానే వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జబర్దస్త్ నుండి వెండితెర కి వెళ్లిన మొట్టమొదటి కమెడియన్ ఇతనే. సినిమాల్లో అప్పట్లో బాగా బిజీ అవ్వడం వల్ల జబర్దస్త్ ని వదిలేయాల్సి వచ్చింది. అంతే కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 లో ఇతనికి ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. అంతటి పీక్ కెరీర్ ని చూసిన చలాకి చంటి, ఒక్కసారిగా బాగా డౌన్ అయ్యి, మళ్లీ ఇప్పుడు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేలా చేశాయి పరిస్థితులు.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ ఇలా అవ్వడానికి గల కారణాలు చెప్పుకొని బాగా ఎమోషనల్ అయిపోయాడు చంటి. ఆయన మాట్లాడుతూ ‘ఈ కాలం లో డబ్బులు ఉంటేనే మనిషికి విలువ. డబ్బు లేకుంటే అసలు పట్టించుకోరు. డబ్బులు ఉన్నప్పుడు నా చుట్టూ అందరూ ఉండేవారు. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సినీ ఇండస్ట్రీ లో బాగా పరిచయం ఉన్న ఎంతో మంది నా వైపు చూడడం కూడా మానేశారు. ఎప్పుడైనా ఎదురుపడితే కనీసం పలకరించేవాళ్ళు కూడా కాదు. కొంతమంది నాపై దుష్ప్రచారాలు చేయడం వల్ల సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను. నాకు ఈగో బాగా ఎక్కువని, షూటింగ్స్ కి డబ్బులు ఎక్కువ అడుగుతానని , సంబంధం లేని ఎన్నో వివాదాల్లో, గొడవల్లో నన్ను ఇరికించి అవకాశాలు రానివ్వకుండా దూరం చేసారు. వాళ్లకు నా ఆవేదన కర్మ రూపం లో గట్టిగానే తగులుతుంది. వాళ్ళ నాశనం చూసిన తర్వాతే నేను చస్తాను’ అంటూ చలాకి చంటి చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.
ప్రస్తుతం పాపం చంటి చేతిలో జబర్దస్త్ అనే షో తప్ప, మరొకటి లేదు. ఒకప్పుడు ఈటీవీ లో ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో లోనూ చంటి ఉండేవాడు. ‘నా షో..నా ఇష్టం’ లాంటి షోస్ కి యాంకర్ గా కూడా వ్యవహరించాడు. ఈటీవీ లో సంచలన విజయం సాధించిన ‘ఢీ;’ డ్యాన్స్ రియాలిటీ షో కి అప్పుడప్పుడు యాంకర్ గా కూడా వ్యవహరించేవాడు. అలాంటి చంటి నేడు ఈ స్థానానికి పడిపోవడం బాధాకరం. ఈయన స్కిట్స్ ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది కమెడియన్స్ నేడు ఇండస్ట్రీ లో కమెడియన్స్ గా స్థిరపడి గొప్ప స్థాయిలో ఉన్నారు. కానీ చంటి మాత్రం ఇలా అయిపోయాడు.