Allu Aravind Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది. ‘ఎవరికి వారే యమునా తీరే’ అనే వైఖరిని చూపిస్తున్నారా? ఆయా హీరోలు చేస్తున్న ఆ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడం తప్ప సినిమా ఇండస్ట్రీ ఎటు పోతుంది.. ఇండస్ట్రీకి ఏం చేస్తే బాగుంటుంది, మంచి సినిమాలు చేసి అవార్డులను అందుకున్న వాళ్ళని ప్రోత్సహించాలి? వాళ్ళని సత్కరించుకోవాలి అనే ఆలోచనలు ఎందుకు చేయడం లేదు అనే కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక రీసెంట్ గా స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అరవింద్ సైతం సైమా వాళ్లు నిర్వహించిన ఫంక్షన్ కి అటెండ్ అవ్వడమే కాకుండా జాతీయ అవార్డుల మీద సినిమా ఇండస్ట్రీ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ కొన్ని వాక్యాలు అయితే చేశాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీని డీ కొట్టే వారు ఎవ్వరు లేరు. మరి ఇలాంటి సందర్భంలో మన ఇండస్ట్రీ అంతా ఏకమై ఒక తాటి మీద నడవాల్సిన అవసరమైతే ఉంది. ఇక 2023 వ సంవత్సరానికి గాను జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇక అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఏడు జాతీయ అవార్డులు రావడం నిజంగా చాలా గొప్ప విషయం…కానీ ఆ అవార్డులను అందుకున్న వాళ్ల ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళకు విషెస్ తెలియజేస్తున్నారు గాని, సినిమా ఇండస్ట్రీలో నుంచి వాళ్ళకు సరైన ఎంకరేజ్ మెంట్ అందటం లేదు. జాతీయ అవార్డు అనేది చాలా గొప్పది. అలాంటి అవార్డుని తీసుకొచ్చిన వాళ్ళకి సరైన ఫంక్షన్ ని నిర్వహించి వాళ్లకి సరైన సత్కారం అందిస్తే మరి కొంతమందికి అది ప్రోత్సాహకంగా ఉంటుంది అంటూ అల్లు అరవింద్ మాట్లాడారు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు అందరం ఒకటే అంటూ చెబుతున్నప్పటికి లో లోపల మాత్రం ఎవరికీ వారు మంచి సినిమాలను చేయాలని ఇతరుల సినిమాలు సక్సెస్ అయితే మాకేంటి లాభం అని ధోరణిలో వాళ్ళ వైఖరి ఉంటుంది. గతంలో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటించినందుకు గానీ అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అయితే వరించింది.
Also Read: తెలుగు హీరోలకు దెబ్బేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్స్…
మరి అలాంటి సందర్భంలో అతనికి కొంతమంది సినిమా సెలబ్రిటీలు విషెస్ ని తెలియజేసినప్పటికి ఒక ఈవెంట్ ని కండక్ట్ చేసి అతన్ని సత్కరించే సాహసమైతే ఎవరూ చేయలేదు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరోకి కూడా జాతీయ అవార్డు అయితే రాలేదు.
అది అందుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్ కావడం తో ఆయనకి మంచి గుర్తింపైతే లభించింది. అతన్ని ఎవరు పట్టించుకోకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి. సినీ పెద్దలుగా ఉంటున్న చాలామంది ఇలాంటి విషయాల మీద తొందరగా స్పందించి అవార్డును అందుకున్న వారిని ప్రోత్సహిస్తే బాగుంటుంది.
Also Read: నాగార్జున కోసం మరికొన్ని పాత్రాలను డిజైన్ చేస్తున్న తెలుగు డైరెక్టర్స్…
మాకేంటి అనే వైఖరిని మెయింటైన్ చేస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వారు సపరేట్ అయి ఇండస్ట్రీని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతుంది. అలా కాకుండా హీరోలు అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి సినిమా ఇండస్ట్రీ ని ముందుకు నడిపించినప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ మరికొద్ది సంవత్సరాలపాటు ఎలాంటి బీటలు వాడకుండా ఒక కోటలాగా నిర్మించబడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…