Homeఎంటర్టైన్మెంట్Caste feeling in Film Industry: ఇండస్ట్రీ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా..? ఆ రెండు...

Caste feeling in Film Industry: ఇండస్ట్రీ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా..? ఆ రెండు కులాల వారికే ఎక్కువ ఛాన్సులు వస్తున్నాయా..?

Caste feeling in Film Industry: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ ఎవ్వరు ఎవరిని పట్టించుకోరు. తిన్న తినకున్న అనుక్షణం సినిమా గురించి ఆలోచిస్తూ ఏదో ఒక రోజు తమకు మంచి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక సంకల్పం ముందుకు దూసుకెళ్లిన వాళ్ళు మాత్రమే ఇక్కడ టాప్ రేంజ్ లోకి వెళ్తారు… ఇక […]

Caste feeling in Film Industry: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ ఎవ్వరు ఎవరిని పట్టించుకోరు. తిన్న తినకున్న అనుక్షణం సినిమా గురించి ఆలోచిస్తూ ఏదో ఒక రోజు తమకు మంచి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక సంకల్పం ముందుకు దూసుకెళ్లిన వాళ్ళు మాత్రమే ఇక్కడ టాప్ రేంజ్ లోకి వెళ్తారు… ఇక ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే రిఫరెన్స్ లతో పాటు క్యాస్ట్ కూడా కీలక పాత్ర వహిస్తుందనే విషయాన్ని కొంతమంది సినిమా మేధావులైతే చెబుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ చాలా విపరీతంగా ఉందని కమ్మ ,కాపు రెండు కులాలకు సంబంధించిన హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు మాత్రమే ఇండస్ట్రీలో మనుగడను సాగిస్తున్నారని ఇతరులు ఎవరైనా వచ్చినా కూడా వారిని ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోవడం లేదంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదంతా చూసిన నెటిజన్లు సైతం సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా లేకపోయిన మన దగ్గర టాలెంట్ ఉండాలి.

కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరిని తొక్కేయాల్సిన పని అయితే లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు ఈజీగా హీరో అయిపోవచ్చు. వీలైతే స్టార్ హీరోగా కూడా మారిపోవచ్చు అంటూ కొంతమంది సినిమా మేధావులు చెబుతుండడం విశేషం…

Also Read: నాగార్జున నెట్ వర్త్ ఎంత..? అందులో నాగ చైతన్యకి , అఖిల్ కి ఎంత ఇవ్వబోతున్నారు..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఈ రెండు కులాలకు చెందిన వారు కావడం వల్ల ఇండస్ట్రీ లో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అందరు భావిస్తున్నారు. కానీ అలా కాదు ఎవరైతే తమ టాలెంట్ ని పూర్తిగా వినియోగించుకొని టాప్ రేంజ్ లో ముందుకు తీసుకెళ్తారో వాళ్ళని మాత్రమే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది.

మిగతా వాళ్లు ఇండస్ట్రీ నుంచి పక్కకెళ్ళిపోవడమే తప్ప వాళ్ళు ఇండస్ట్రీకి చేసేది పెద్దగా ఏమీ ఉండదని కులం ప్రతి సారి అవకాశాన్ని తెచ్చి పెట్టదని చెబుతున్నారు. ఒకవేళ క్యాస్ట్ ఫీలింగ్ తో ఒకరిద్దరు అవకాశాలు ఇచ్చినా కూడా వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవాలి అంటే వాళ్ల దగ్గర దమ్ము ఉండాలని కూడా చెబుతుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper