spot_img
Homeఎంటర్టైన్మెంట్Anasuya: అనసూయ జబర్దస్త్ వదిలేయడానికి రష్మీ కారణమా? తెరపైకి షాకింగ్ మేటర్!

Anasuya: అనసూయ జబర్దస్త్ వదిలేయడానికి రష్మీ కారణమా? తెరపైకి షాకింగ్ మేటర్!

Anasuya: జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఏప్రిల్ 27న తన 36వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా అనసూయ మీద రష్మీ చేసిన సంచలన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ కి వచ్చిన కొత్తలో రష్మీ విపరీతమైన ట్రోలింగ్ కి గురైంది. ముఖ్యంగా అనసూయ స్థానంలో రష్మీ రావడం అప్పట్లో ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఆమెను దారుణంగా విమర్శించారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రష్మీ ఘాటుగా స్పందించింది.

నాకు సంబంధం లేని విషయంలో నన్ను ట్రోల్ చేశారు. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను సైలెంట్ గా ఉండిపోయా. 13 ఎపిసోడ్స్ కే జబర్దస్త్ కి ఇంత క్రేజ్ ఏంటి అని గమనిస్తున్నా.. కానీ నన్ను దారుణంగా తిట్టారు అని రష్మీ ఆవేదన చెందింది. నువ్వు అనసూయ ప్లేస్ ని ఎందుకు ఆక్రమించావు అని యాంకర్ అడిగింది. దానికి రష్మీ .. నేను ఆక్రమించుకోవడం ఏంటి .. లాగేసుకున్న అంటూ పొగరుగా సమాధానం ఇచ్చింది.

అనసూయని పక్కకు పంపి నువ్వు ఎందుకు వచ్చావు అని యాంకర్ ప్రశ్నించగా .. అనసూయ ఏమైనా చిన్న పిల్లా ఏంటి పక్కకి పంపడానికి అంటూ రష్మీ బదులిచ్చింది. అయితే అనసూయ యాంకర్ రాణిస్తున్న సమయంలో రష్మీ నటిగా అవకాశాలు కోసం ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తుంది. అనసూయ కొన్ని వ్యక్తిగత కారణాల వలన జబర్దస్త్ నుంచి తప్పుకుంది. దీంతో ఆ అవకాశం రష్మీ కి దక్కింది. జబర్దస్త్ సక్సెస్ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. అప్పుడు అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇక జబర్దస్త్ యాంకర్ గా రష్మీకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా సుధీర్ తో రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఈ లవ్ ట్రాక్ తో మరింత క్రేజ్ సంపాదించింది. అలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని హీరోయిన్ కావాలనే తన కల నెరవేర్చుకుంది. పలు సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. ప్రస్తుతం ఈటీవీలో ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తుంది.

RELATED ARTICLES

Most Popular