Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. రెండవ రోజు వసూళ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు, షోస్ , థియేటర్స్ భారీగా పెంచినప్పటికీ కూడా , టికెట్స్ దొరకక ఇబ్బంది పడ్డారు ప్రేక్షకులు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 2 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 2 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాము.
రెండవ రోజు ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి ఏకంగా 5 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ ప్రాంతం లో రెండు రోజులకు కలిపి 10 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో కూడా ఈ సినిమా వసూళ్లు సునామీ ని సృష్టిస్తోంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 2 వ రోజున 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రెండు రోజులకు కలిపి 3 కోట్ల 7 లక్షల రూపాయిలు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 2 రోజుల్లో 2 కోట్ల 2 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఈస్ట్ గోదావరి నుండి 1 కోటి 50 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి రూపాయిలు గుంటూరు జిల్లా నుండి 1 కోటి 53 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 1 కోటి 25 లక్షలు, నెల్లూరు నుండి 75 లక్షలు వచ్చాయి.
ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 21 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 34 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 4 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 49 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిర్మాతలకు 20 కోట్ల రూపాయలకు పైగా లాభాలు రాగా, బయ్యర్స్ కి 6 కోట్ల 73 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. నేటి తో బయ్యర్స్ కూడా 20 కోట్ల లాభాల మార్కు లోకి అడుగుపెట్టబోతున్నారు.