spot_img
Homeఎంటర్టైన్మెంట్Mass Maharaj Ravi Teja: మాస్ మహారాజ్ కు విలన్ గా ఆ హీరోయిన్ ?

Mass Maharaj Ravi Teja: మాస్ మహారాజ్ కు విలన్ గా ఆ హీరోయిన్ ?

Mass Maharaj Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా వరుస సినిమాల్లో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఒకేసారి ఏకంగా 5 సినిమాలను లైన్‌ లో పెట్టారు రవితేజ. ఇప్పటికే ‘ఖిలాడీ’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డ రవితేజ, ఈ సినిమా ఇంకా విడుదల కాక ముందే ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇక ఈ సినిమాతో పాటు సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్‌ అధికారిక ప్రకటన కూడా చేసింది. కాగా సంక్రాంతి నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

interesting news about ravi teja ravanasura movie

సంక్రాంతి సందర్భంగా జవనరి 14న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించనున్నారాణి సమాచారం అందుతుంది. ఈ క్రమం లోనే నటీనటులను ఖరారు చేసే పనిలో పడింది చిత్రయూనిట్‌. కాగా ఈ సినిమాలో రవితేజాను ఓ లేడీ విలన్‌ ఢీకొట్టనున్నట్లు సమాచారం. ఈ పవర్‌ఫుల్‌ పాత్ర కోసం హీరోయిన్‌ను రంగంలోకి దించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ పాత్రకు దక్షా నగార్కర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సినిమా కథ విన్న దక్షా నగార్కర్ తన పాత్ర నచ్చడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హుషారు సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ… తనదైన నటనతో కుర్రకారుకి బాగా దగ్గరైంది. ఆ తర్వాత జాంబిరెడ్డి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది దక్షా. ఇక రావణాసుర సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఏ రేంజ్ లో అలరిస్తుందో అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper