HomeజాతీయంIndia Army: భారత్ షాడోస్ అండ్ స్టీల్ 2.0.. పాక్, చైనా, అమెరికా కు వణుకే.....

India Army: భారత్ షాడోస్ అండ్ స్టీల్ 2.0.. పాక్, చైనా, అమెరికా కు వణుకే.. వైరల్ వీడియో

India Army: ఆధునిక కాలంలో యుద్ధాలు జరిగే తీరు మారింది. దేశాలకు సంబంధించిన భద్రత కూడా సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆయుధాలను సమకూర్చుకోవడం.. యుద్ధ తంత్రాలను అమలు చేయడం అన్ని దేశాలు కొత్త కొత్తగా అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు యుద్ధాలు అంటే.. అత్యాధునిక ఆయుధ సామాగ్రి అంటే మనకు కేవలం అమెరికా.. చైనా దేశాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు వాటిని మరిపించే విధంగా.. వాటిని అధిగమించే విధంగా తయారైంది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ […]

India Army: ఆధునిక కాలంలో యుద్ధాలు జరిగే తీరు మారింది. దేశాలకు సంబంధించిన భద్రత కూడా సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆయుధాలను సమకూర్చుకోవడం.. యుద్ధ తంత్రాలను అమలు చేయడం అన్ని దేశాలు కొత్త కొత్తగా అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు యుద్ధాలు అంటే.. అత్యాధునిక ఆయుధ సామాగ్రి అంటే మనకు కేవలం అమెరికా.. చైనా దేశాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు వాటిని మరిపించే విధంగా.. వాటిని అధిగమించే విధంగా తయారైంది ఇండియన్ ఆర్మీ.

ఇండియన్ ఆర్మీ గతంతో పోల్చి చూస్తే అత్యంత శక్తివంతంగా మారింది.. ఆయుధాల విషయంలో.. ఆర్మీ విషయంలో.. యుద్ధ తంత్రాల విషయంలో అత్యాధునిక విధానాలను పాటిస్తోంది. దీనికి సంబంధించి ప్రపంచానికి ఒక టీజర్ విడుదల చేసింది. టీజర్ లోనే ఇండియన్ ఆర్మీ సత్తా ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ టీజర్ భారతీయులకు ఆనందాన్ని కలిగిస్తుంటే.. పాకిస్తాన్.. చైనా.. అమెరికాకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది.. ఆ టీజర్ లో ఇండియన్ ఆర్మీ ఆధునిక యుద్ధ తంత్రాలు.. సైనిక సామర్థ్యం.. కార్యాచరణ.. సన్నద్ధత వంటివి క్లియర్ గా కనిపిస్తున్నాయి.. దీనికి ఇండియన్ ఆర్మీ షాడోస్ అండ్ స్టీల్ 2.0 అనే పేరును ఖరారు చేసింది. ఆగస్టు 16 ఉదయం 9 గంటలకు దీనిని ప్రారంభించనుంది.. సరికొత్త సైనిక వ్యూహాలను… సాంకేతికత.. ఆపరేషన్ల సన్నద్ధతను ఇందులో చూపించబోతున్నారు. ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన ఈ కొత్త ప్రచారానికి సంబంధించిన దృశ్యాలు.. వీడియోలు అద్భుతంగా ఉన్నాయి.

ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీని అత్యంత బలోపేతం చేస్తోంది. ఆయుధాల విషయంలో.. ఆర్మీ ని శక్తివంతం చేసే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను ఇండియన్ డిఫెన్స్ వింగ్ డెవలప్ చేస్తోంది. అనేక దేశాలతో ఆయుధాల కాంట్రాక్టులు కూడా కుదుర్చుకుంటున్నది. బ్రహ్మోస్ వంటి మిస్సైల్స్ ను విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నది. అమెరికా ఆయుధాలు.. చైనా మిస్సైల్స్.. పాకిస్తాన్ బాంబులు విఫలమవుతున్న వేళ.. ఇండియన్ ఆర్మీ రూపొందించిన మిస్సైల్స్ మాత్రం అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ ద్వారా భారత్ చేపట్టిన దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్య పోయేలా చేశాయి.

అత్యంత ఖచ్చితత్వంతో ఈ మిస్సైల్స్ దాడులు చేయడం.. ప్రాణం నష్టం లేకుండా కేవలం ఆస్తి నష్టాన్ని మాత్రమే కలగజేయడం రక్షణ రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటినుంచి ఇండియన్ ఆర్మీ తయారుచేసిన ఆయుధాలకు ప్రపంచ మార్కెట్లలో డిమాండ్ పెరిగింది. అందువల్లే కాంట్రాక్టులు పెరుగుతున్నాయి. వందల కోట్ల నుంచి వేలకోట్లకు ఆయుధాల కాంట్రాక్టులు పెరిగిపోవడం విశేషం. తాజాగా ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన టీజర్ ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది.. ఇదే దూకుడు కనక ఇండియన్ ఆర్మీ కొనసాగిస్తే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న దేశంగా భారత్ నిలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Indian Army (@indianarmy.adgpi)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper