Hyper Aadi Jabardasth re entry: 12 ఏళ్ళ నుండి నాన్ స్టాప్ గా కొనసాగుతున్న ఏకైక టీవీ షో ఏదైనా ఉందా అంటే అది ‘జబర్దస్త్’ మాత్రమే. ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయమై టాప్ స్థానానికి చేరుకున్నారు. అందులో సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను , హైపర్ ఆది , షకలక శంకర్, చమ్మక్ చంద్ర ఇలా ఎంతో మంది ఉన్నారు. అంతే కాదు , ప్రస్తుతం కమెడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్న సత్య కూడా జబర్దస్త్ నుండి వచ్చిన వాడే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఈ షో ఒకప్పటి రేంజ్ ఆదరణ దక్కించుకోలేకపోతుంది. టీఆర్ఫీ రేటింగ్స్ చాలా తక్కువ వస్తున్నాయి. అందుకే ఈ షోకి ఒకప్పుడు మూలస్తంభం లాగా ఉన్నటువంటి నాగబాబు ని జడ్జీ గా మరోసారి తీసుకొచ్చారు.
ఈ షో బాగా డల్ అయిపోవడానికి మరో ముఖ్య కారణం టాప్ కమెడియన్స్ అయినటువంటి సుడిగాలి సుధీర్, హైపర్ ఆది , చమ్మక్ చంద్ర , ఇమ్మానుయేల్ , అవినాష్ వంటి వారు షో ని వదిలి వెళ్లిపోవడమే. వీళ్ళు వెళ్ళిపోయాక కామెడీ బాగా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు నాగబాబు స్పెషల్ రిక్వెస్ట్ మీద, హైపర్ ఆది ఈ షో లో పాల్గొనడానికి ఒప్పుకున్నాడు. కానీ శాశ్వతంగా కాదు , కేవలం ఒక స్కిట్ లో గెస్ట్ గా మాత్రమే ఆయన సందడి చేయబోతున్నాడు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. తన మార్కు పంచులతో ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేయడం లో హైపర్ ఆది దిట్ట. అందుకే ఆయన ప్రతీ స్కిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. అలాంటి హైపర్ ఆది లేని లోటు జబర్దస్త్ లో స్పష్టంగా కనిపిస్తూ వచ్చేది.
అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ షో లోకి ఎంట్రీ ఇవ్వడం తో పూర్వ వైభవం తిరిగి వచ్చినట్టు అయ్యింది. తన మార్కు పంచులతో మరోసారి పొట్టచెక్కలు అయ్యేలా చేసాడు హైపర్ ఆది. అందుకు సంబంధించిన ప్రోమో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఒకపక్క సినిమాలు చేస్తూనే , మరో పక్క ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ 20 డ్యాన్స్ షోలో, అదే విధంగా ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లో కనిపిస్తూ ఉంటాడు హైపర్ ఆది. అయితే ఇప్పుడు ఆయన గెస్ట్ గా పాల్గొన్న ఈ స్పెషల్ జబర్దస్త్ స్కిట్ కోసం ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని టాక్.