Homeఎంటర్టైన్మెంట్ప్చ్.. ఆ మహనీయుడి పరువు తీస్తున్నారు !

ప్చ్.. ఆ మహనీయుడి పరువు తీస్తున్నారు !

లెజండరీ దర్శకులు దాసరి నారాయణ రావు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ఆయనే పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యకు పరిష్కారం చూపించేవారు కానీ ఆయన మరణించిన తర్వాత వారి కుమారులు మధ్య వచ్చిన ఆస్తి పంపకాల సమస్యను మాత్రం ఎవరు తీర్చలేకపోయారు. ఇప్పటికే అన్నదమ్ములిద్దరూ పలు వివాదాల్లో ఇరుక్కుని దాసరిగారి పరువు తీశారు. అయితే, తాజాగా దాసరి ప్రభు, అరుణ్ ల పై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. […]

Dasari Narayana Rao Sonsలెజండరీ దర్శకులు దాసరి నారాయణ రావు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ఆయనే పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యకు పరిష్కారం చూపించేవారు కానీ ఆయన మరణించిన తర్వాత వారి కుమారులు మధ్య వచ్చిన ఆస్తి పంపకాల సమస్యను మాత్రం ఎవరు తీర్చలేకపోయారు. ఇప్పటికే అన్నదమ్ములిద్దరూ పలు వివాదాల్లో ఇరుక్కుని దాసరిగారి పరువు తీశారు.

అయితే, తాజాగా దాసరి ప్రభు, అరుణ్ ల పై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎందుకు వీరి పై కేసు నమోదు అయింది అంటే.. గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు ఎల్లారెడ్డిగూడాలో నివసిస్తున్నారు. అయితే.. సోమశేఖర్ రావు, దాసరి నారాయణరావు బతికి ఉన్నప్పుడు అప్పు ఇచ్చారు. కాగా, దాసరి గారు అనారోగ్యంతో ఉన్న రోజుల్లో పలు దఫాలుగా ఆయన నుండి దాదాపు రూ. 2.10 కోట్లను అప్పు తీసుకున్నారట.

కానీ దాసరి మరణించారు. ఇక ఆ తర్వాత సోమశేఖర్ రావు డబ్బు కోసం దాసరి కుమారులను నిలదీశారు. పెద్దల సమక్షంలో జరిగిన చర్చల్లో దాసరి ప్రభు, అరుణ్ లు సోమశేఖర్ రావుకి 2.10 కోట్లకు బదులు 1.15 కోట్ల రూపాయలను చెల్లిస్తామని అంగీకరించారు. ఈ మేరకు ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. కానీ దాసరి ప్రభు, అరుణ్ ఒప్పుకున్న డబ్బును కూడా కట్టలేదట.

తన డబ్బును ఎలాగైనా కట్టండి అంటూ అట్లూరి సోమశేఖర్ రావు, ఈ నెల 14న దాసరి నివాసానికి వెళ్లి అడిగారు. అయితే, డబ్బులు ఇవ్వమని అడిగినందుకు, దాసరి ఇద్దరు కుమారులు మా ఇంటికి వస్తే చంపేస్తామని అంటూ అట్లూరి సోమశేఖర్ రావుని బెదిరించారట. దీంతో చేసేది ఏమి లేక అట్లూరి సోమశేఖర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. దాసరి లాంటి మహనీయుడి పరువు తీస్తున్నారు వీళ్ళు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper