Swetha Menon Police Case: మలయాళం లో అడల్ట్ సినిమాల ద్వారా తనకంటూ యూత్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న నటి శ్వేతా మీనన్(Swetha Menon). ఈమె చేసే సినిమాలు యూత్ ఆడియన్స్ వరకు ఎంజాయ్ చేస్తారేమో కానీ సమాజ హితం కోరుకునే వాళ్ళు అసలు ప్రోత్సహించరు. ఈమె కారణంగా యూత్ చెడిపోతున్నారని సామజిక కార్యకర్త మార్టిన్ కెరలోని కొచ్చి ప్రాంత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఆమె నటించిన సినిమాల్లోని అడల్ట్ సన్నివేశాలు, అభ్యంతకరమైన డైలాగ్స్, సోషల్ మీడియా లో ఈమెకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదు లో పేర్కొన్నాడు. అయితే మార్టిన్ ఇచ్చిన ఈ ఫిర్యాదుని కొచ్చి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన ఎర్నాకుళం కోర్టుని ఆశ్రయించాడు. ఈమె పిటీషన్ ని విచాటించిన కోర్టు ఈమెపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో రంగం లోకి దిగిన పోలీసులు శ్వేతా మీనన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మన టాలీవుడ్ మూవీ ఆర్టిస్టు అస్సోసియేషన్ ఉన్నట్టుగానే మలయాళం లో మలయాళం మూవీ ఆర్టిస్ట్( అమ్మ) అనే అస్సోసియేషన్ ఒకటి ఉంది. దీనికి త్వరలో జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికల పోటీ శ్వేతా మీనన్ కూడా రేస్ లో ఉంది. సరిగ్గా ఇలాంటి సమయం లో ఆమెపై ఇలాంటి కేసు నమోదు అవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శ్వేతా మీనన్ 1994 వ సంవత్సరం లో ‘ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్’ టైటిల్ ని గెలుచుకుంది. అలా పాపులారిటీ సంపాదించిన ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈమె తోటి హీరోయిన్స్ కూడా ఇలా మిస్ ఇండియా గా ఎంపికై సినిమాల్లో అవకాశాలు సంపాదించిన వారే. కానీ వాళ్ళు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ గా స్టార్ హీరోల సరసన నటిస్తూ నేడు ఎంతో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారు.
Also Read: తెలంగాణ పవర్ స్టార్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకుంటున్న స్టార్ హీరో…
కానీ శ్వేతా మీనన్ మాత్రం అడల్ట్ సినిమాల దారిని ఎంచుకుంది. ఈమె చేసిన సినిమాలను ఒకసారి పరిశీలిస్తే ‘అనస్వరం’, ‘రతి నిర్వేదం’ , ‘100 డిగ్రీ సెల్సియస్’ వంటివి ఉంటాయి. ఇవన్నీ అడల్ట్ కంటెంట్ మలయాళం సినిమాలే. ఇక తెలుగు లో ఈమె ‘ఆనందం’ అనే ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఇందులో ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఆ తర్వాత ఈమెని మన టాలీవుడ్ మేకర్స్ అంతగా పట్టించుకోలేదు.