Posani Krishna Murali : ఆ కేసుల విచారణ నిమిత్తం కోర్టు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు ఇటీవల హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో మై హోమ్ భుజ లో పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఆ తర్వాత ఆయనను జడ్జి ఆదేశాల మేరకు కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత ఏపీలోని పలు పోలీస్ స్టేషన్ల అధికారులు పీటి వారెంట్లు జారీ చేయడంతో పోసాని కృష్ణ మురళి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒక కేసులో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ.. మిగతా స్టేషన్లో పోలీసులు పిటి వారెంట్లు జారీ చేయడంతో ఇతర పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన దుస్థితి పోసాని కృష్ణ మురళికి ఎదురవుతోంది.. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా పోసాని కృష్ణ మురళి ఉన్నారు. అయితే ఆయనను పీటీ వారెంట్ మీద విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు అనంతరం విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోసాని కృష్ణ మురళిని హాజరు పరిచారు. కోర్టు పోసాని కృష్ణమురళికి మార్చి 20 వరకు రిమాండ్ విధించింది. జనసేన నేత శంకర్ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి పై కేసు నమోదయింది.
Also Read : ఫాఫం.. పోసానిని తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతున్నారే?
అప్పటివరకు జైల్లోనే..
జనసేన నేత శంకర్ ఫిర్యాదు మేరకు విజయవాడ భవానిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణమురళి ని అరెస్టు చేశారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఆదేశాల మేరకు కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. కర్నూలు జిల్లా పోలీసులు పిటి వారెంట్ జారీ చేయడంతో.. ఆయన కర్నూలు జిల్లా సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అందులో బెయిల్ వచ్చినప్పటికీ భవానిపురం పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో పోసాని కృష్ణ మురళి విజయవాడ రావాల్సి వచ్చింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి పోసాని కృష్ణమురళికి మార్చి 20 వరకు రిమాండ్ విధించారు. పవన్ కళ్యాణ్ పై, చంద్రబాబు నాయుడి పై పోసాని కృష్ణ మురళి అనుచితంగా వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేత శంకర్ విజయవాడ భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. దీంతో కర్నూలు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న పోసాని కృష్ణ మురళిని భవానిపురం పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. అక్కడ జడ్జి ఎదుట ప్రవేశపెట్టి.. ఆయన ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఇప్పటికే వైసిపి నేత వల్లభనేని వంశీ విజయవాడ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read : పోసాని కృష్ణ మురళికి హైకోర్టులో ఊరట..ఆ కేసుల నుండి తప్పించుకున్నట్టేనా..? పూర్తి వివరాలు మీకోసం!