Homeఎంటర్టైన్మెంట్Hey Balwanth 4 days worldwide collections: 'హే బల్వంత్' 4 రోజుల వరల్డ్ వైడ్...

Hey Balwanth 4 days worldwide collections: ‘హే బల్వంత్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇలా అయితే బ్రేక్ ఈవెన్ అయ్యేది ఎప్పుడు?

Hey Balwanth 4 days worldwide collections: సాధారణంగా ప్రతీ ఏడాదికి ఫిబ్రవరి నెల టాలీవుడ్ కి అన్ సీజన్ అని అందరూ అంటుంటారు. ఈ సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ రావు అనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్పే మాట. అయితే గడిచిన రెండేళ్లలో ఫిబ్రవరి నెల ప్రభావం మన సినిమాలపై అంతగా పడలేదు కానీ , ఈ ఫిబ్రవరి నెల మాత్రం మన టాలీవుడ్ సినిమాలపై చాలా గట్టి […]

Hey Balwanth 4 days worldwide collections: సాధారణంగా ప్రతీ ఏడాదికి ఫిబ్రవరి నెల టాలీవుడ్ కి అన్ సీజన్ అని అందరూ అంటుంటారు. ఈ సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ రావు అనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్పే మాట. అయితే గడిచిన రెండేళ్లలో ఫిబ్రవరి నెల ప్రభావం మన సినిమాలపై అంతగా పడలేదు కానీ , ఈ ఫిబ్రవరి నెల మాత్రం మన టాలీవుడ్ సినిమాలపై చాలా గట్టి ప్రభావమే పడింది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నాయి. అలాంటి సినిమాలలో ఒకటి , సుహాస్(Actor Suhas) హీరోగా నటించిన ‘హే బల్వంత్'(Hey Balvanth). విడుదలకు ముందు మంచి పాజిటివ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా , విడుదల తర్వాత కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

నాలుగు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది? , బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా ఎంత వసూళ్లను రాబట్టాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం . ఈ చిత్రానికి నాల్గవ రోజున 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట . కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే నైజాం ప్రాంతం నుండి కోటి రూపాయిల షేర్ వసూళ్లు రాగా ఆంద్ర + సీడెడ్ ప్రాంతం నుండి 1.02 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 2.02 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 3.9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 1.18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని , ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 3.20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 6.45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే లాంగ్ రన్ లో ఈ చిత్రం మరో 4.3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. టార్గెట్ పెద్దదే , కానీ నిన్నటి లాగా డీసెంట్ రేంజ్ వసూళ్లు రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తే కచ్చితంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెడుతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper